JSON Variables

సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు

సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు

న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  ఆధ్వర్యంలో  భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్  నియామకమైన సందర్భంగా పెద్ద ఎత్తున ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఏ సందర్భంగా  పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ బండి సంజయ్  నియామకంతో బిజిపి శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీకి క్రమశిక్షణ నిబద్ధతతో  పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుంది అని బండి సంజయ్  నిరూపించారని వారి యొక్క మార్గదర్శకంలో  బిజెపి నాయకులను కార్యకర్తలను అందరం కూడా  వారి స్ఫూర్తితో పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడతామని తెలియజేశారు. సీనియర్ నాయకులు మేకల మల్లేశం, బత్తిని సాయి గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారాపు శ్రావణ్,పట్టణ శాఖ అధ్యక్షుడు గంగ అనిల్,మండలాధికార ప్రతినిధి పున్ని రాజు, ఓబిసి జిల్లా కోశాధికారి చెప్పాల గంగాధర్,కేంద్రం ఇన్చార్జులు దేశెట్టి శ్రీనివాస్,అమ్ముల అశోక్, లొంకోజు చంద్రం, కొలనూరు ముత్తక్క,వజ్జపల్లి శ్రీకాంత్,దళిత మోర్చ ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్, బూత్ అధ్యక్షులు కుడుముల శ్రీహరి, కంచె మహేందర్,బొల్లం రామ్ సాగర్, అక్కేమ్ మధు,ఓరుగంటి చింటూ  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments