Skip to main content

Posts

Showing posts with the label Karimnagar News

ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ముదిరాజ్ సమాజానికి న్యాయం..

  ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పుతో  ముదిరాజ్ సమాజానికి న్యాయం.. •  తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనచ్చుల మహేందర్ కరీంనగర్: సినీనటి ప్రత్యూష ముదిరాజ్  కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా న్యాయస్థానాలపై ముదిరాజ్ సమాజానికి పూర్తి నమ్మకం, విశ్వాసం మరింత బలపడిందని తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనచ్చుల మహేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2002 ఫిబ్రవరి 23న జరిగిన సినీనటి ప్రత్యూష ముదిరాజ్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు విధించిన శిక్షను స్వాగతిస్తూ, ఈ తీర్పు ద్వారా ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు భావిస్తూ, ఈ కేసులో ప్రత్యూష ముదిరాజ్ గారి తల్లి సరోజిని ముదిరాజ్  నిరంతరం చేసిన పోరాటమే నిందితుడికి శిక్ష పడటానికి ప్రధాన కారణమని, ఆమె ధైర్యం, పట్టుదల సమాజానికి ఆదర్శమని, ఇప్పడే ప్రత్యూష ముదిరాజ్ ఆత్మకు శాంతి చేకూరుతుందని, న్యాయం ఆలస్యమైనా తప్పకుండా జరుగుతుందనే నమ్మక...

కరీంనగర్‌లో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.. భగ్గుమన్న ముదిరాజ్ సంఘాలు!

  కరీంనగర్‌లో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.. బీసీ ద్రోహి అంటూ భగ్గుమన్న ముదిరాజ్ సంఘాలు! కరీంనగర్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా కరీంనగర్‌లో ముదిరాజ్ సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన్ను 'బీసీ ద్రోహి'గా అభివర్ణిస్తూ పెద్దమ్మ తల్లి అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (TMPS) ఆధ్వర్యంలో నగరంలోని గీత భవన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన తీరుపై తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ బిడ్డకు అన్యాయం చేశారని ఆరోపణలు.. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నేతలు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో, బీసీ బిడ్డ అయిన నీలం కవిత-మధు ముదిరాజ్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే వాహనంలో వెళ్లి తన ఎక్స్-అఫీషియో (Ex-Officio) ఓటును వినియోగించుకోవడం బీసీ సమాజానికి తీరని అన్యాయం చేయడమేనని నాయకులు ఆరోపించా...