ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ముదిరాజ్ సమాజానికి న్యాయం..
• తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనచ్చుల మహేందర్
కరీంనగర్:
సినీనటి ప్రత్యూష ముదిరాజ్ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా న్యాయస్థానాలపై ముదిరాజ్ సమాజానికి పూర్తి నమ్మకం, విశ్వాసం మరింత బలపడిందని తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనచ్చుల మహేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2002 ఫిబ్రవరి 23న జరిగిన సినీనటి ప్రత్యూష ముదిరాజ్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు విధించిన శిక్షను స్వాగతిస్తూ, ఈ తీర్పు ద్వారా ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు భావిస్తూ, ఈ కేసులో ప్రత్యూష ముదిరాజ్ గారి తల్లి సరోజిని ముదిరాజ్ నిరంతరం చేసిన పోరాటమే నిందితుడికి శిక్ష పడటానికి ప్రధాన కారణమని, ఆమె ధైర్యం, పట్టుదల సమాజానికి ఆదర్శమని, ఇప్పడే ప్రత్యూష ముదిరాజ్ ఆత్మకు శాంతి చేకూరుతుందని, న్యాయం ఆలస్యమైనా తప్పకుండా జరుగుతుందనే నమ్మకం ఈ తీర్పుతో మరింత బలపడిందన్నారు.

