Skip to main content

కరీంనగర్‌లో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.. భగ్గుమన్న ముదిరాజ్ సంఘాలు!

 

కరీంనగర్‌లో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.. భగ్గుమన్న ముదిరాజ్ సంఘాలు!
కరీంనగర్‌లో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.. బీసీ ద్రోహి అంటూ భగ్గుమన్న ముదిరాజ్ సంఘాలు!

కరీంనగర్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా కరీంనగర్‌లో ముదిరాజ్ సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన్ను 'బీసీ ద్రోహి'గా అభివర్ణిస్తూ పెద్దమ్మ తల్లి అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (TMPS) ఆధ్వర్యంలో నగరంలోని గీత భవన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన తీరుపై తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

బీసీ బిడ్డకు అన్యాయం చేశారని ఆరోపణలు..

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నేతలు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో, బీసీ బిడ్డ అయిన నీలం కవిత-మధు ముదిరాజ్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఆ సమయంలో ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే వాహనంలో వెళ్లి తన ఎక్స్-అఫీషియో (Ex-Officio) ఓటును వినియోగించుకోవడం బీసీ సమాజానికి తీరని అన్యాయం చేయడమేనని నాయకులు ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచిన ఒక ప్రజాప్రతినిధి, తిరిగి ఆ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. భవిష్యత్తులోనూ బీసీ హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న  నాయకులు:

ఈ కార్యక్రమంలో జేఏసీ మరియు ముదిరాజ్ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జేఏసీ అధ్యక్షులు: చిక్కుడు రాజయ్య ముదిరాజ్

ప్రధాన కార్యదర్శి: నిమ్మల కిషన్ ముదిరాజ్

టీ.ఎం.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడు: కూనచ్చుల మహేందర్ ముదిరాజ్

జిల్లా కార్యదర్శి: ఎరవేణి రామాంజనేయులు

జిల్లా అధికార ప్రతినిధి: మౌటం సంపత్ ముదిరాజ్

ఇతర నాయకులు: బాలంకి మల్లేష్ ముదిరాజ్, పిల్లి రవి ముదిరాజ్, ఉపాధ్యక్షులు గుడ్డెలుగులా పోచయ్య, ఎన్.ఎం.ఆర్ శేఖర్, ఎరవేణి లక్ష్మణ్, తిప్పరవేణి స్వామి, మాచర్ల రమేష్, గరిగే రాజయ్య, కొత్తూరు రాజయ్య, జెట్టి సంపత్, జడగల శ్రీనివాస్, జెట్టి బాలయ్య, జెట్టి ప్రభాకర్, రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...