Skip to main content

Posts

Showing posts from December, 2022

సహస్ర చండీ మహాయాగంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు

సహస్ర చండీ మహాయాగంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు  న్యూస్ పవర్  , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డి పల్లె శ్రీ రామలింగేశ్వర స్వామి  ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహస్ర చండీ మహాయాగంలో ఆయన పాల్గొన్నారు, శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం సనాతన ధర్మం యొక్క విశిష్టతను వివరించారు .ఎంతో భక్తిశ్రద్ధలతో వ్యయ ప్రయాసలకు కోర్చి ఇంతవరకు మండలంలో ఎవరు చేయని విధంగా పెద్ద ఎత్తున సహస్ర మహా చండీ యాగాన్ని వేద పండితులు చెరుకు పవన్ శర్మ  నిర్వహించడం పట్ల అభినందించారు. చెరుకు పవన్ శర్మను ఎంపీపీ దంపతులు ప్రజాప్రతినిధులు తో కలిసి శాలువాతో జ్ఞాపకం అందజేసి సత్కరించారు. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలోచనతో మంచి కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినంద నీయమని పవన్ శర్మను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, సర్పంచ్ తుంకుంట శ్రీలత నరేందర్ రెడ్డి, సర్పంచులు చల్ల నారాయణ, జితేందర్ గౌడ్, నీల అంజయ్య  మనోహర్ రెడ్డి,బాబు, వెంకటేశం, ఓల్లాల మ...

టి ఎల్ ఎం మేళా కి ఆహ్వానము

టి ఎల్ ఎం మేళా కి ఆహ్వానము న్యూస్ పవర్ , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల స్థాయిలో జనవరి 4వ తేదీన వైశ్య భవన్ లో నిర్వహిస్తున్న TLM మేళాకి  ముఖ్య అతిధులుగా హాజరు కావలసినదిగా  MPP  వుట్కూరి వెంకట రమణా రెడ్డి నీ  ఆహ్వానించిన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మహేష్ చంద్ర ,ఉపాధ్యాయులు సందీప్ రెడ్డి ,జలందర్ రెడ్డి మరియు రామలింగారెడ్డి‌. ఈ కార్యక్రమంలో సర్పంచులు తిరుపతి రెడ్డి మల్లా రెడ్డి  పాల్గొన్నారు...

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై మామిడి మహేందర్

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై మామిడి మహేందర్ న్యూస్ పవర్ , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట : సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు యువకులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సె మామిడి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ డీజే లు గాని సౌండ్ సిస్టం గాని నిర్వహించరాదని. రోడ్లపై వేడుకలను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వరుసగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

పైలేరియా వ్యాధిగ్రస్తులకు ఎంఎండిపి కిట్స్ ని అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్

పైలేరియా వ్యాధిగ్రస్తులకు ఎంఎండిపి  కిట్స్ ని అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ జనం న్యూస్ , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించే ఎం.ఎం. డి.పి కిట్లను తొమ్మిది మందికి అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ అందజేశారు... ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ నే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.. ఈ కిట్ లో టబ్బులు , టవల్స్ , మగ్గు , సోప్ , ఆయింట్మెంట్ లు ఉంటాయని అన్నారు.. ఇందులో భాగంగానే ఫైలేరియా ఉన్న వారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలని వారికి ఎం.ఎం. డి.పి కిట్ లను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.. అనంతరం వారు వాటిని ఎలా ఉపయోగించాలో సూపర్వైజర్ నయీమ్ వివరించారు..ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నయీమ్ , ఏఎన్ఎం జ్యోతి , ఆశా కార్యకర్తలు విజయ, పద్మ, సౌమ్య మరియు ఫైలేరియా ఉన్నవారు పాల్గొన్నారు. మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి  

భాదిత కుటుంబానికి 25కిలోల బియ్యం అందజేత

భాదిత కుటుంబానికి 25కిలోల బియ్యం అందజేత  న్యూస్ పవర్ , 28 డిసెంబర్ , ఇల్లంతకుంట :  ఇల్లంతకుంట మండలంలోని జవారీ పేట గ్రామంలో   కీ.శే.కాంపెల్లి బాబు(50) ఈ మధ్యనే అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.వీరికి ముగ్గురు కూతుళ్లు,ఒక్క అబ్బాయి వున్నారు.ఈ కుటుంబానికి వేధశ్రీ డిగ్రీ కళాశాల ఇల్లంతకుంట తరుపున, ప్రిన్సిపాల్  భత్తిని ఆంజనేయులు  సేవదృక్పథం తో 25కేజీ ల బియ్యం  వారి కుంటుంభానికి అందజేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో కట్కురి శ్రీనివాస్ మరియు దామెర స్వామి పాల్గొనడం జరిగింది. మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

మండల పంచాయతీ అధికారి మీర్జాకు వినతి పత్రం

మండల పంచాయతీ అధికారి మీర్జాకు వినతి పత్రం  న్యూస్ పవర్ , 28 డిసెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట  మండలంలో మండల పరషత్ కార్యాలయం లో మండల పరిషత్ అధికారి మీర్జాకు బుధ వారం రోజున 15 వ ఆర్థిక నిధులు మరియు ఎస్ ఎఫ్ సి నిధులు ట్యాంకర్ బిల్లులు గ్రామపంచాయతీల  ఖాతాలో జమ చేయాలని   సర్పంచులు ఎంపీ ఓ కు వినతి పత్రం అందజేశారు . మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చెయ్యండి 

కన్నులపండువగా జరుతున్న శీ భద్రాది సీతరామచంద్రస్వామి కల్యాణ మహోత్సం

కన్నులపండువగా జరుతున్న శీ భద్రాది సీతరామచంద్రస్వామి కల్యాణ మహోత్సం   న్యూస్ పవర్, 28 డిసెంబర్ , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగం రెడ్డి పల్లి గ్రామంలో  సహాస్రమహా చండీ యాగం కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీ భద్రాది సీతరాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నులపండువగా జరిగింది, నిర్వహకులు వేద పురహితులు చెఱకు పవన్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో కల్యాణ మహోత్సవం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ట్రాన్స్ కో డైరెక్టర్ జాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, సిద్దిపేట జిల్లా జడ్పీచైర్ పర్సన్ రోజా రాధకృష్ణ శర్మ దంపతులు, సర్పంచ్ తుంకుంట శ్రీలత నరేందర్ రెడ్డి, నిర్వహాకులు, గ్రామస్థులు, వేదపండితులు పాల్గొన్నారు. మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

పీఎసెబి గురించి క్షేత్ర స్థాయి సందర్శన

పీఎసెబి  గురించి క్షేత్ర స్థాయి సందర్శన   న్యూస్ పవర్ , 28 డిసెంబర్ , ఇల్లంతకుంట: ఈరోజు రేపాక క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారి రవళి రైతుల పొలం లో భాస్వరం ను కరిగించే జీవన ఎరువయిన పీఎసెబి  గురించి క్షేత్ర స్థాయి సందర్శన నిర్వహించడం జరిగింది.రైతుల వ్యవసాయ పొలం లో మొక్కకు లభ్యం కానీ రూపం లో నిరుపయోగంగా ఉన్న భాస్వరం, పీఎస్ బీ అనే జీవన ఎరువును వేయడం వలన కరిగి లభ్య రూపం లోకి మారి మొక్కలకు అందుబాటులో కి వస్తుందని సూచించారు.ఈ జీవన ఎరువు వాడడం వలన రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలియ జేయడం జరిగింది.ఎకరాకు అర లీటర్ ద్రావణం పశువుల ఎరువు లో గాని,వర్మి కంపోస్ట్ లో గాని కలిపి భూమిలో నేరుగా వెదజల్లే విధానం లో వాడుకోవచ్చని సూచించారు.నేలలో తేమ ఉన్నపుడు దీనిని వాడుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చని వివరించారు. కార్యక్రమం లో నర్ర రమణ రెడ్డి,తోట మధుసూదన్ గ్రామ రైతులు పాల్గొన్నారు. మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

రైతుల నోట్లో మట్టికొట్టడానికే కేంద్రం చట్టాలు తెస్తుంది

రైతుల నోట్లో మట్టికొట్టడానికే కేంద్రం చట్టాలు తెస్తుంది -మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ -సెస్ ఎన్నికల్లో రవిందర్ రెడ్డి గెలుపు ఖాయం -కల్లాల డబ్బులను కేంద్రం వెంటనే రైతులకు విడుదల చేయాలి  న్యూస్ పవర్, 23 డిసెంబర్ , ఇల్లంతకుంట: రైతుల నోట్లో మట్టి కొట్టడానికే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ రైతువ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారన్నారు. రైతులు ఉపాధిహామీ పథకం ద్వారా పొలాల వద్ద కల్లాలు నిర్మాణం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల  నుంచి రైతులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధాని, అంబానీలకు కొమ్ముకాస్తుందని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 8 ఎల్ల కాలంలో దేశం అప్పుల పాలయిందని, స్విస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెచ్చి పేదలకు అకౌంట్లలో 15 లక...

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు న్యూస్ పవర్ , 22 డిసెంబర్ , ఇల్లంతకుంట : ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కేరళ మోడల్ హైస్కూల్ లో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ, చార్ట్ ప్రదర్శన లు నిర్వహించారు. విద్యార్థులు రామానుజన్ హార్డీ సంఖ్య 1729 రూపంలో మానవహారాన్ని నిర్వహించారు. తదనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ రామానుజన్ అద్భుతమైన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడని, 12 సంవత్సరాల వయస్సులో త్రికోణమితిలో ప్రావీణ్యం సంపాదించడం తో పాటు సంఖ్య సిద్ధాంతం, అనంత శ్రేణి, నిరంతర భిన్నాలు వంటి గణిత శాస్త్ర భావనలకు  కృషి చేసిన గొప్ప విజ్ఞానని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్, గణిత ఉపాధ్యాయులు నరేష్ రెడ్డి, ఉపాధ్యాయులు బాలకృష్ణ, ఘని, బిజూ, బిన్సీ, షిను వర్గీష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 

అనంతగిరి ఉన్నత పాఠశాల లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం

అనంతగిరి ఉన్నత పాఠశాల లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం న్యూస్ పవర్ , 22 డిసెంబర్  , ఇల్లంతకుంట :  గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్  జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అనంతగిరి లో విద్యార్థులచే తయారు చేయబడిన గణిత ఉపకరణాలతో గణిత మేళా నిర్వహించడం జరిగింది, ఇలా విద్యార్థులచే గణిత నమూనాలను తయారు చేయించడం, విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టడానికి,గణితం పట్ల ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడతాయాని ఈ సందర్బంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు  తెలిపారు, ఈ కార్యక్రమం లో , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్  ,గణిత ఉపాధ్యాయులు రామాంజనేయులు , పాఠశాల గణిత ఉపాధ్యాయులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ , ఉపాధ్యాయ, ఉధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు .

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి గన్నేరం నర్సయ్య

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి గన్నేరం నర్సయ్య   న్యూస్ పవర్ , 22 డిసెంబర్ , ఇల్లంతకుంట :   రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో  రాష్ట్ర మూడవ కార్మికమహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కార్మికులు, సన్నా చిన్న కారు రైతులు పాల్గొనాలన్నారు,  వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాటి నుండి నేటి వరకు భూమిలేని నిరుపేదల కోసం అనేక భూపోరాటాలు నిర్వహించి ప్రభుత్వ భూములను పేదలకు పంచిన చరిత్ర మరియు ఇండ్ల స్థలాలు కూడా పంపిణీ చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉన్నదని తెలియజేశారు. నేటికీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటన్నింటినీ పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వము భూమి ఉన్న వారందరికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతుబంధు ఇస్తున్నట్లు భూమిలేని నిరుపేద దళిత గిరిజన వెనకబడ్డ తరగతులకు సంబంధించిన పేదలకు ఐదు ఎకరాల చొప్పున రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేసినారు.  ఇప్పటికైనా ప్రభుత్వము ఇండ్లు...

సెస్ ఎన్నికల్లో స్వత్రంత అభ్యర్థి భూంపల్లి రాఘవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు

సెస్ ఎన్నికల్లో స్వత్రంత అభ్యర్థి భూంపల్లి రాఘవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు   న్యూస్ పవర్ , 19 డిసెంబర్ , ఇల్లంతకుంట : జరగబోయే ఇల్లంతకుంట మండల సెస్ ఎన్నికల్లో స్వత్రంత అభ్యర్థి భూంపల్లి రాఘవరెడ్డి కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి తెలిపారు, సెస్ ఓటర్లందరని ఆలోచించి స్వత్రంత అభ్యర్థి బ్యాట్ గుర్తు పై వేసి అత్యధిక మెజరీటితో గెలిపించాలని కోరాడు, ఈ కార్యక్రమంలో జిల్ల ఉపాధ్యక్షులు చిట్టి ఆనందరెడ్డి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి బాలపోచయ్య , యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వినయ్ కుమార్,మైనర్టీ అధ్యక్షుడు జమాల్ , విజయ్, బడుగు లింగం,ఎసగందుల ప్రసాద్, బద్దం రమణ రెడ్డి,జుట్టు నగేష్,మల్లేశం, మామిడి నరేష్ , నరేందర్ రెడ్డి, తాట్ల వీరేశంకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశ చట్ట సభల భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి

దేశ చట్ట సభల భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి న్యూస్ పవర్ , 16 డిసెంబర్ , ఇల్లంతకుంట:  తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా"బి. ఆర్. అంబేద్కర్ పెట్టి అదేవిదంగా ఢిల్లీ లో నిర్మిస్తున్న నూతన అత్యున్నత పార్లమెంట్ భవనానికి డా"బి. ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ...ఈ శీతాకాల సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనానికి డా" బాబా సాహెబ్ బి. ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఇల్లంతకుంట మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం ముందు ఈ నెల 14 నుండి మూడు రోజుల పాటు సామాజిక ఉద్యమ కారుడు సావనపెల్లి రాకేష్ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది 3 రోజు ల నిరాహార దీక్ష విజయవంతం చేసుకొని ఈ రోజు విరమణ చేసి సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. . ఈ శీతాకాల సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి, కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా కొనసాగుతున్న బండి సంజయ్  పార్లమెంట్ సమావేశంలో పార్లమెంట్ భవనానికి  అంబేద్కర్ పేరు నా...

గ్రామపంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని మండల బిజెపి నాయకుల ధర్నా

గ్రామపంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని మండల బిజెపి నాయకుల ధర్నా   న్యూస్ పవర్ , 9 డిసెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా గ్రామాలను అప్పులపాలు చేస్తోందనీ పంచాయతీ ఆస్తులు వేలం పటా వేసే పరిస్థితి పై మండల బీజేపీ నాయకులు ధర్నా చేశారు,   బెంద్రం.తిరుపతి రెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడతూ.. రాష్ట్రములోని  గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్ర శేఖర్ రావు  నిధులు విడుదల చేయకపోవడంతో పరిశుద్ధ కార్మికులు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు, కెసీఆర్ మాట నమ్మి గ్రామ పంచాయతి  సర్పంచ్లు బ్యాంకుల నుండి అప్పులు తీసుకొని ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే అప్పులు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు సర్పంచ్లకు  కార్యదర్శి లకు మెస్సేజ్లు, ఫోన్ చేస్తూ ఇబ్బందులు పెడ్తు,పంచాయతీ ఆస్తులు వేలం వేసి అమ్ముతున్నారు, గత 70 సంవత్సరాలలో  ఏ ప్రభుత్వ పాలనలో కూడా ఈవిధంగా గ్రామ పంచాయతీ లను అప్పుల పాలు చేయలేదన్నారు, పంచాయతీలను  నిర్వీర్యం చేస్తు సర్పంచ్ లను  హక్కులన...

ఘనంగా శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రీమతి  సోనియా గాంధీ  జన్మదిన వేడుకలు    న్యూస్ పవర్ , 9 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకట్  ఆధ్వర్యంలో  ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి  సోనియా గాంధీ  జన్మదిన పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పటాకులు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది, శ్రీమతి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు యావత్ తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఆమె సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ భగవంతున్ని ప్రార్ధన చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి మానకొండూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బాల పోశయ్య బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజ్ సంతోష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు జెట్టి మల్లేశం ఉ...

అమ్మవారి సేవలో ఎం.పి.పి వుట్కూరి వెంకట రమణారెడ్డి

అమ్మవారి సేవలో ఎం.పి.పి  వుట్కూరి వెంకట రమణారెడ్డి    న్యూస్ పవర్ , 9 డిసెంబర్ , ఇల్లంతకుంట :  ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి , వారితోపాటు పిఎసిఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి , రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మాధవ రెడ్డి ,గ్రామ ప్రజలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా  దివ్యాంగుల దినోత్సవం - ఆటల పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన మండల విద్యాధికారి బన్నాజి న్యూస్ పవర్ , 6 డిసెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల విద్యా వనరుల కేంద్రం నందు ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగ బాలబాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బన్నాజీ మాట్లాడుతూ దివ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులకు బరువు కాదు బాధ్యత అని గుర్తు చేశారు  ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష తెలంగాణ దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్లు సద్వినియోగం చేసుకుంటూ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక బోధకులు ఐఇఆర్పి నరేందర్ టీచర్లు జలంధర్ రెడ్డి హరేందర్ రెడ్డి పి ఈ టి షబ్బీర్ భాష సిఆర్పిలు నరసయ్య మల్లేశం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పంట అవశేషాల యాజమాన్యం పై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి కార్యక్రమము

పంట అవశేషాల యాజమాన్యం పై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి కార్యక్రమము  న్యూస్ పవర్, 5 డిసెంబర్ , ఇల్లంతకుంట : ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవాన్ని పురస్కించుకుని జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ మరియ వ్యవసాయ శాఖ, ఇల్లంతకుంట మండలం వారి ఆధ్వర్యంలో రైతు వేదిక, ఇల్లంతకుంటలో వివిధ పంటలలో పంట అవశేషాల నిర్వహణ పద్ధతులపై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు వాడాలని అదే విధంగా పంట అవశేషాల యాజమాన్యం, పంట మార్పిడి చేయడం, మల్చింగ్ చేయడం వంటివి చేయాలని సూచించారు. అదే విధంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు  తెలియజేశారు. అలాగే ప్రత్తి కొయ్యకాల్లను బయో శ్రెడ్డెర్స్ వినియోగించాలని కోరారు. తదుపరి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యాసంగి పంటలలో లో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి స్రవంతి,...

అయ్యప్ప ఆలయ నిర్మాణ స్థలంలో పడి పూజ

అయ్యప్ప ఆలయ నిర్మాణ స్థలంలో పడి పూజ    న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణ నిమిత్తం భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్మాణ ప్రాంగణంలో శ్రీశ్రీ రాజు గురుస్వామి, ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాలని కోరారు. అదే విధంగా నేటి నుండి నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు, ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సెస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సెస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) ఎన్నికల నేపథ్యంలో సోమవారం 15 డైరెక్టర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్టేట్ కోపరేటివ్ ఎలక్షన్స్ అథారిటీ అడిషనల్ రిజిస్టర్ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. బోయినపల్లి ఎస్సీ మహిళ,   సిరిసిల్ల టౌన్ 1, వేములవాడ టౌన్ 1 మహిళలకు రిజర్వు కాగా మిగతా అన్ని స్థానాలు జనరల్ గా  ప్రకటించారు.

బాదిత కుటుంబాలను పరామర్శించిన వోరగంటి

బాదిత కుటుంబాలను పరామర్శించిన వోరగంటి   న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల పర్యటనలో భాగంగా గాళిపెల్లి గ్రామానికి  చెందిన జంగపెల్లి దుర్గ మల్లయ్య  , జవారిపేట గ్రామానికి చెందిన కాంపెల్లి మైసయ్య   గత కొన్ని రోజుల క్రితం మరణించగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు  వోరగంటి ఆనంద్  వారి కుటుంబాను పరామర్శించి సానుభూతిని తెలిపారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

బి టి ఆర్ ఫౌండేషన్ నుంచి మృతుల కుటుంబాలకు సహాయం

బి టి ఆర్ ఫౌండేషన్ నుంచి మృతుల కుటుంబాలకు సహాయం   న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామంలోని తిప్పరాపు బాలవ్వ పేద కూలి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించటంతో వారి సభ్యులను ఓదార్చి 50 కేజీ బియ్యం సహాయం అందిస్తు, మరో పేద కుటుంబ  కుర్రు.ఎల్లవ్వ కూడా ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50కేజీ   బియ్యం సహాయం అందించారు ,  రహీంఖాన్ పేట గ్రామంలో బత్తిని.గౌరవ్వ అకస్మికంగా మరణించాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీ  బియ్యం సహాయం ద్వారా అందజేసిన బి టి ఆర్  ఫౌండేషన్ వ్యవస్థాపకుడు  బెంద్రం.తిరుపతిరెడ్డి మాట్లాడతూ..ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై  బి టి ఆర్ ఫౌండేషన్  మీకు అండగా వుంటుందాన్నరు,పేద కుటుంబాలకు ఎల్లపుడు సహాయం మందిస్తామన్నారు, ఈ సహాయా సేవాలలో బిి టి ఆర్  ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, కోశాధికారి బోయిని.రంజిత్ నాయకులు బత్తిని.స్వామి, అంతటి.వేణు, సుదగోని.రాజు, కొలనూర్.ముత్తాక్క, కట్ట. పోచయ్య, యువకులు తది...

నేల ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలి

నేల ఆరోగ్యాన్ని  మెరుగు పరుచుకోవాలి   న్యూస్ పవర్, 5 డిసెంబర్ , ఇల్లంతకుంట : ప్రపంచ మృత్తిక దినోత్సవం సమావేశం సోమవారం రోజున రేపాక రైతువేదిక లో ప్రపంచ నేలల దినోత్సవం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారిని రవళి రైతు స్థాయిలో నేల ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవాలి అనే విషయాల పై వివరిస్తూ రైతులు అవసారనికి మించి రసాయన ఎరువులు వాడకుండ పచ్చి రొట్ట ఎరువులయిన జీలుగ,జనుము,పిల్లి పెసర వంటి వి వేసుకోవాలని తద్వారా నేల కోత ని కూడా అరికట్టవచ్చని వివరించారు, వీటితో పాటు జీవన ఎరువులయిన పి ఎస్ బి , పంట మార్పిడి,అంతట పంటల వల్ల నేల ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై వివరించడం జరిగింది, కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి ,ఎంపీటీసీ కాత సుమలత మల్లేశం  పాల్గొన్నారు .

సంవత్సరాల వయసు పైబడిన వారు క్రొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలి

సంవత్సరాల వయసు పైబడిన వారు క్రొత్తగా  ఓటరు నమోదు చేసుకోవాలి   న్యూస్ పవర్, 3 డిసెంబర్, ఇల్లంతకుంట : ఈ రోజు ఇల్లంతకుంట మండలం పొత్తుర్ గ్రామములో 18 సంవత్సరాల వయసు పైబడిన వారు క్రొత్తగా  ఓటరు నమోదు చేసుకోవాలని మరియు ఇంతకుముందు ఉన్న ఓటర్ కార్డులో చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలని గ్రామ సర్పంచ్  సిద్ధం  శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమం ఈరోజు మరియు రేపు తేదీ 3,4 లలో ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు .ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారి పరుశురాములు ప్యాక్స్ డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి బి ఎల్ ఓ లక్ష్మణ చారి వీఆర్ఏ శేఖర్ మరియు గ్రామంలోని యువకులు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణ నే ప్రభుత్వ లక్ష్యం - వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

ఆరోగ్య తెలంగాణ నే ప్రభుత్వ లక్ష్యం -  వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్  న్యూస్ పవర్, 3 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మధుమేహం వ్యాధి ఉన్నవారికి ఎన్. సి.డి మందుల కిట్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి తో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు, ఈ సందర్బంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కై ప్రభుత్వం మధుమేహం వ్యాధి ఉన్న వారికి ఇంటి వద్దకే ఎన్. సి.డి మందుల కిట్ ని పంపిణీ చేస్తుంది అని అన్నారు, అధిక రక్తపోటు మరియు మధుమేహం నియంత్రణలో లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తదని అన్నారు, ప్రభుత్వం అందించే ఈ కిట్ ని మధుమేహం ఉన్నవారు డాక్టర్ గారు సూచించిన విధంగా మందులను క్రమం తప్పకుండా వాడాలని అన్నారు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి , ఏ. ఎన్. ఎం జ్యోతి , ఆశా కార్యకర్తలు విజయ , పద్మ , సౌమ్య , మరియు మధుమేహం వ్యాధి గ్రస్థులు పాల్గొన్నారు.

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన బి టి ఆర్ ఫౌండేషన్

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన  బి టి ఆర్ ఫౌండేషన్   న్యూస్ పవర్, 3 డిసెంబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం లోని గాలి పెళ్లి గ్రామంలో జంగపల్లి మల్లయ్య నిరుపేద కూలి మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కిలో బియ్యం సహాయం అందించి మరియు రేపాక గ్రామంలోని తడకపల్లి నాగరాజు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసినారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అప్పన్న మీకు అండగా ఉంటుందన్నారు పేద కుటుంబాలకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో శ్రీకాంత్ అనంతగిరి అనిల్ గజ్జల శ్రీనివాస్ కథ మల్లేశం జంగపల్లి రాజయ్య బట్టు లచ్చయ్య పెద్ద రాజయ్య బట్టు స్వామి కొమ్ము మల్లేశం ఓరుగంటి అంజి సుధాగోని రాజు కోమటిరెడ్డి అజయ్ తడకపెల్లి రజనీకాంత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంది శ్రీనివాస్ రెడ్డి

ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంది శ్రీనివాస్ రెడ్డి   న్యూస్ పవర్, 2 డిసెంబర్ , ఇల్లంతకుంట : ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి రెడ్డి కరుణాకర్ రెడ్డి నియామకపు ఉత్తర్వులు అందజేశారు,  ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అదేవిధంగా రైతులకు ఏకకాలంలో రైతులందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు మాఫీ చేయలేదని రైతు బీమా 59 నుండి 65 సంవత్సరాలు పెంచాలని రైతులందరికీ 50 సంవత్సరాలు నిండిన రైతులందరికీ  5000 రూపాలు పెన్షన్ ఇవ్వాలని   నెలకు 5000 రూపాయలు పించిని ఇవ్వాలని ప్రతి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హా లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు , తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఉమ్...

ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల మానవహారం

ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల మానవహారం  న్యూస్ పవర్ , 1 డిసెంబర్, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ హైస్కూల్  నందు  ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం ను పురస్కరించుకుని నివారణ పై అవగాహన కల్పించడానికి విద్యార్థులు మానవహారం నిర్వహించారు. హెచ్‌ఐవి పట్ల నిశ్శబ్దాన్ని విడనాడండి, హెచ్‌ఐవికి నివారణ ఒక్కటే మార్గమని నినాదాలు చేశారు. ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నివారించేందుకు, నిర్మూలించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బిన్సీ, బిజూ, నరేష్ రెడ్డి, బాలకృష్ణ, ఘని, షిను వర్గీష్, రాజీ, నవీన్  లతో పాటు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.