JSON Variables

గ్రామపంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని మండల బిజెపి నాయకుల ధర్నా

గ్రామపంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని మండల బిజెపి నాయకుల ధర్నా

 న్యూస్ పవర్ , 9 డిసెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా గ్రామాలను అప్పులపాలు చేస్తోందనీ పంచాయతీ ఆస్తులు వేలం పటా వేసే పరిస్థితి పై మండల బీజేపీ నాయకులు ధర్నా చేశారు,
 బెంద్రం.తిరుపతి రెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడతూ.. రాష్ట్రములోని  గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్ర శేఖర్ రావు  నిధులు విడుదల చేయకపోవడంతో పరిశుద్ధ కార్మికులు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు, కెసీఆర్ మాట నమ్మి గ్రామ పంచాయతి  సర్పంచ్లు బ్యాంకుల నుండి అప్పులు తీసుకొని ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే అప్పులు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు సర్పంచ్లకు  కార్యదర్శి లకు మెస్సేజ్లు, ఫోన్ చేస్తూ ఇబ్బందులు పెడ్తు,పంచాయతీ ఆస్తులు వేలం వేసి అమ్ముతున్నారు, గత 70 సంవత్సరాలలో  ఏ ప్రభుత్వ పాలనలో కూడా ఈవిధంగా గ్రామ పంచాయతీ లను అప్పుల పాలు చేయలేదన్నారు, పంచాయతీలను  నిర్వీర్యం చేస్తు సర్పంచ్ లను  హక్కులను కాలారస్తుందన్నారు, కేంద్ర ప్రభుత్వ నిధులను కెసిఆర్ వాళ్ళ స్వంత అవసరాలకు మల్లించుకొని, సర్పంచ్ లు  చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో సోమారంపేట సర్పంచ్ వడ్డే. ఆనందరెడ్డి  ఆత్మహత్య చేసుకున్నారు ఐనా ఇప్పటికి ఆ కుటుంబనికి ప్రభుత్వం ఏ సహాయం అందించలేదన్నారు,పంచాయసర్పంచ్ లు ఆస్తులు అమ్ముకొని చివరకు పుస్తెలు అమ్మకునే పరిస్థితి తెచ్చిన కెసిఆర్ తక్షణమే పంచాయతీలను కాపాడాలని ఇల్లంతకుంట మండలంలోని అన్నీ గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలనీ  డిమాండ్ చేస్తున్నామాన్నరు. సర్పంచ్ అందరు మనోదైర్యన్ని కోల్పోవద్దని  భారతీయ జనతా పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు, ధర్నా వద్దకి పోలీస్ అధికారులు వచ్చి మండల అభివృద్ధి  అధికారితో మాట్లాడించి కలెక్టర్ గారితో మాట్లాడి నిధులు విడుదల చేపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించిన బీజేపీ నాయకులు
 బొల్లారం.ప్రసన్న, గజ్జల.శ్రీనివాస్ ,బత్తిని.స్వామి, నాగసముద్రాల.సంతోష్,బండారి.రాజ్, మామిడి.హరీష్, వజ్జపెల్లి.శ్రీకాంత్, సూదుల కిషన్, సుదగోని.శ్రీకాంత్, ఎలుక. వర్ధన్, మామిడి. శ్రీకాంత్, దయాల.రాజ్, పున్ని. రాజు, పున్ని.ప్రశాంత్, చుక్క. రమేష్, తడూరి.అనిల్, వజ్జపెల్ల. శ్రీకాంత్, సుదగోని.రాజు, కేశవేణి.భూమేష్, జేరిపోతుల. మధు, దురుముట్ల.ప్రశాంత్, సలేంద్రి..అజయ్, సిరికొండ. సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments