JSON Variables

అనంతగిరి ఉన్నత పాఠశాల లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం

అనంతగిరి ఉన్నత పాఠశాల లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం

న్యూస్ పవర్ , 22 డిసెంబర్  , ఇల్లంతకుంట :
 గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్  జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అనంతగిరి లో విద్యార్థులచే తయారు చేయబడిన గణిత ఉపకరణాలతో గణిత మేళా నిర్వహించడం జరిగింది, ఇలా విద్యార్థులచే గణిత నమూనాలను తయారు చేయించడం, విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టడానికి,గణితం పట్ల ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడతాయాని ఈ సందర్బంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు  తెలిపారు, ఈ కార్యక్రమం లో , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్  ,గణిత ఉపాధ్యాయులు రామాంజనేయులు , పాఠశాల గణిత ఉపాధ్యాయులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ , ఉపాధ్యాయ, ఉధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments