JSON Variables

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి గన్నేరం నర్సయ్య

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయండి గన్నేరం నర్సయ్య

 న్యూస్ పవర్ , 22 డిసెంబర్ , ఇల్లంతకుంట :
  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో  రాష్ట్ర మూడవ కార్మికమహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కార్మికులు, సన్నా చిన్న కారు రైతులు పాల్గొనాలన్నారు,  వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాటి నుండి నేటి వరకు భూమిలేని నిరుపేదల కోసం అనేక భూపోరాటాలు నిర్వహించి ప్రభుత్వ భూములను పేదలకు పంచిన చరిత్ర మరియు ఇండ్ల స్థలాలు కూడా పంపిణీ చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉన్నదని తెలియజేశారు. నేటికీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటన్నింటినీ పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వము భూమి ఉన్న వారందరికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతుబంధు ఇస్తున్నట్లు భూమిలేని నిరుపేద దళిత గిరిజన వెనకబడ్డ తరగతులకు సంబంధించిన పేదలకు ఐదు ఎకరాల చొప్పున రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేసినారు.  ఇప్పటికైనా ప్రభుత్వము ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, మూడు లక్షలు ఇస్తానన్న ప్రభుత్వము కొందరికి ఇస్తామని అనడం సరియైన పద్దతి కాదని గ్రామంలో గ్రామ సభలు పెట్టి స్థలమున్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక పోరాటాల ఫలితం వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని వివిధ కుంటి సాకులతో ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని కనీస కూలి 257 నిర్ణయించి వాటిని కూడా ఇవ్వకుండా రోజుకు 100 నుంచి 150 రూపాయల వరకు మాత్రమే ఇస్తున్నారని దీనితో పేదలు తమ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని 200 రోజుల పని దినాలు కల్పించాలని కనీస  ప్రమాద భీమ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో  సామాజిక సమస్యలపై . ఈనెల 29, 30, 31 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మూడవ మహాసభలో చర్చించి నూతన పోరాటాలు రూపొందిస్తామని తెలియజేశారు. ఈ మహాసభల సందర్భంగా 29న నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ . మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం  అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం . జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ హాజరవుతున్నారు కావున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని. అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ పెళ్లి రాములు సామ నరసింహారెడ్డి ఎల్లయ్య లక్ష్మణ్ ప్రభాకర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments