JSON Variables

నేల ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలి

నేల ఆరోగ్యాన్ని  మెరుగు పరుచుకోవాలి

 న్యూస్ పవర్, 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ప్రపంచ మృత్తిక దినోత్సవం సమావేశం
సోమవారం రోజున రేపాక రైతువేదిక లో ప్రపంచ నేలల దినోత్సవం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారిని రవళి రైతు స్థాయిలో నేల ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవాలి అనే విషయాల పై వివరిస్తూ రైతులు అవసారనికి మించి రసాయన ఎరువులు వాడకుండ పచ్చి రొట్ట ఎరువులయిన జీలుగ,జనుము,పిల్లి పెసర వంటి వి వేసుకోవాలని తద్వారా నేల కోత ని కూడా అరికట్టవచ్చని వివరించారు, వీటితో పాటు జీవన ఎరువులయిన పి ఎస్ బి , పంట మార్పిడి,అంతట పంటల వల్ల నేల ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై వివరించడం జరిగింది, కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి ,ఎంపీటీసీ కాత సుమలత మల్లేశం  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments