JSON Variables

ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల మానవహారం

ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల మానవహారం
 న్యూస్ పవర్ , 1 డిసెంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ హైస్కూల్  నందు  ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం ను పురస్కరించుకుని నివారణ పై అవగాహన కల్పించడానికి విద్యార్థులు మానవహారం నిర్వహించారు. హెచ్‌ఐవి పట్ల నిశ్శబ్దాన్ని విడనాడండి, హెచ్‌ఐవికి నివారణ ఒక్కటే మార్గమని నినాదాలు చేశారు. ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నివారించేందుకు, నిర్మూలించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బిన్సీ, బిజూ, నరేష్ రెడ్డి, బాలకృష్ణ, ఘని, షిను వర్గీష్, రాజీ, నవీన్  లతో పాటు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments