JSON Variables

పైలేరియా వ్యాధిగ్రస్తులకు ఎంఎండిపి కిట్స్ ని అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్

పైలేరియా వ్యాధిగ్రస్తులకు ఎంఎండిపి  కిట్స్ ని అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్

జనం న్యూస్ , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించే ఎం.ఎం. డి.పి కిట్లను తొమ్మిది మందికి అందజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ అందజేశారు... ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ నే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.. ఈ కిట్ లో టబ్బులు , టవల్స్ , మగ్గు , సోప్ , ఆయింట్మెంట్ లు ఉంటాయని అన్నారు.. ఇందులో భాగంగానే ఫైలేరియా ఉన్న వారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలని వారికి ఎం.ఎం. డి.పి కిట్ లను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.. అనంతరం వారు వాటిని ఎలా ఉపయోగించాలో సూపర్వైజర్ నయీమ్ వివరించారు..ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నయీమ్ , ఏఎన్ఎం జ్యోతి , ఆశా కార్యకర్తలు విజయ, పద్మ, సౌమ్య మరియు ఫైలేరియా ఉన్నవారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments