JSON Variables

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

న్యూస్ పవర్ , 22 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని కేరళ మోడల్ హైస్కూల్ లో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ, చార్ట్ ప్రదర్శన లు నిర్వహించారు. విద్యార్థులు రామానుజన్ హార్డీ సంఖ్య 1729 రూపంలో మానవహారాన్ని నిర్వహించారు. తదనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ రామానుజన్ అద్భుతమైన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడని, 12 సంవత్సరాల వయస్సులో త్రికోణమితిలో ప్రావీణ్యం సంపాదించడం తో పాటు సంఖ్య సిద్ధాంతం, అనంత శ్రేణి, నిరంతర భిన్నాలు వంటి గణిత శాస్త్ర భావనలకు  కృషి చేసిన గొప్ప విజ్ఞానని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్, గణిత ఉపాధ్యాయులు నరేష్ రెడ్డి, ఉపాధ్యాయులు బాలకృష్ణ, ఘని, బిజూ, బిన్సీ, షిను వర్గీష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments