JSON Variables

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా  దివ్యాంగుల దినోత్సవం


- ఆటల పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన మండల విద్యాధికారి బన్నాజి


న్యూస్ పవర్ , 6 డిసెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల విద్యా వనరుల కేంద్రం నందు ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగ బాలబాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బన్నాజీ మాట్లాడుతూ దివ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులకు బరువు కాదు బాధ్యత అని గుర్తు చేశారు  ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష తెలంగాణ దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్లు సద్వినియోగం చేసుకుంటూ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక బోధకులు ఐఇఆర్పి నరేందర్ టీచర్లు జలంధర్ రెడ్డి హరేందర్ రెడ్డి పి ఈ టి షబ్బీర్ భాష సిఆర్పిలు నరసయ్య మల్లేశం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments