JSON Variables

పంట అవశేషాల యాజమాన్యం పై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి కార్యక్రమము

పంట అవశేషాల యాజమాన్యం పై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి కార్యక్రమము 


న్యూస్ పవర్, 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవాన్ని పురస్కించుకుని జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ మరియ వ్యవసాయ శాఖ, ఇల్లంతకుంట మండలం వారి ఆధ్వర్యంలో రైతు వేదిక, ఇల్లంతకుంటలో వివిధ పంటలలో పంట అవశేషాల నిర్వహణ పద్ధతులపై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు వాడాలని అదే విధంగా పంట అవశేషాల యాజమాన్యం, పంట మార్పిడి చేయడం, మల్చింగ్ చేయడం వంటివి చేయాలని సూచించారు. అదే విధంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు  తెలియజేశారు. అలాగే ప్రత్తి కొయ్యకాల్లను బయో శ్రెడ్డెర్స్ వినియోగించాలని కోరారు. తదుపరి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యాసంగి పంటలలో లో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి స్రవంతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి గంగ, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు  మరియు రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments