Skip to main content

Posts

Showing posts from January, 2024

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం  న్యూస్ పవర్ , 30 జనవరి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను, పోలీస్ అధికారులు, సీసీ కెమెరాల దాతలు, ప్రజాప్రదినిధులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్  ప్రారంభించారు  గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దాతలు ఓలాద్రి సత్యనారాయణ రెడ్డి,మల్లేశం గౌడ్,గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ ఎంపిటిసి, మహిళా సంఘo సోదరిమణులను, యువకులు, గ్రామస్తులను  జిల్లా ఎస్పీ అభినందించారు  అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని,గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెర...

శ్రీరామ నామ ఆకృతిలో వాణీనికేతన్ విద్యార్థులు

శ్రీరామ నామ ఆకృతిలో వాణీనికేతన్ విద్యార్థులు న్యూస్ పవర్, 20 జనవరి, ఇల్లంతకుంట : అయోద్య రామ మందిరంలో ఈనెల 22న బాలరామ ప్రాణప్రతిష్ట ఉన్న నేపథ్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రములోని వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు శ్రీరామ నామ ఆకృతి ప్రదర్శన చేశారు. అయోద్య రాముడి అక్షింతలను అన్ని గ్రామాలలో ఇంటింటికి వితరణ చేస్తున్న కార్యక్రమానికి తోడుగా విద్యార్థులు ఇలా ప్రదర్శించడం అభినందనీయం అని పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాద్యాయులు శ్రీనివాస్, మల్లేశం, రాజు, రమేష్, సంతోష్, రాజు,శోభ, సుమంగళి,రేఖ,రేవతి, లావణ్య, మహలక్షి,మౌణిక. సునంద, స్వాతి, మౌణిక.కళ్యాణి, షమీమలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి • జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన రేపాక జట్టును సన్మానించిన ఎంపీపీ  • యువత క్రీడల్లో రాణిస్తూ, సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి •  ఇల్లంతకుంట  ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి న్యూస్ పవర్ , 19 జనవరి , ఇల్లంతకుంట : యువత క్రీడల్లో రాణిస్తూ, సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా కృషి చేయాలనీ  ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి అన్నారు  శుక్రవారం తన చాంబర్లో జిల్లెల్ల లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచిన రేపాక జట్టును అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని,  సన్మార్గంలో యువత నడిచినప్పుడే ఆ గ్రామం బాగుంటుందన్నారు.  యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యం చేరుకునే విధంగా ప్రయత్నించాలన్నారు.  ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కాత సుమలత మల్లేశం ,దొమ్మాటి కిషోర్ గౌడ్, నాయిని స్రవంతి రమేష్ గౌడ్, బద్దం ఎల్లారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.