JSON Variables

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి


• జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన రేపాక జట్టును సన్మానించిన ఎంపీపీ 
• యువత క్రీడల్లో రాణిస్తూ, సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి
•  ఇల్లంతకుంట  ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి

న్యూస్ పవర్ , 19 జనవరి , ఇల్లంతకుంట :
యువత క్రీడల్లో రాణిస్తూ, సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా కృషి చేయాలనీ ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి అన్నారు 
శుక్రవారం తన చాంబర్లో జిల్లెల్ల లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచిన రేపాక జట్టును అభినందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, సన్మార్గంలో యువత నడిచినప్పుడే ఆ గ్రామం బాగుంటుందన్నారు.  యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యం చేరుకునే విధంగా ప్రయత్నించాలన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కాత సుమలత మల్లేశం ,దొమ్మాటి కిషోర్ గౌడ్, నాయిని స్రవంతి రమేష్ గౌడ్, బద్దం ఎల్లారెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments