రాజన్న సిరిసిల్లలో మినీ జాబ్ మేళా: ఏప్రిల్ 21న నిరుద్యోగులకు సువర్ణావకాశం!
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 20: తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21-04-2026న సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఆఫీసు నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేళా ద్వారా ఆపరేల్ పార్క్ (Tailoring - మహిళలకు మాత్రమే), ఫోన్ పే, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జియో ఫైబర్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
అర్హతలు: ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వేతనం: నెలకు ₹15,000 నుండి ₹20,000 వరకు ఉంటుంది.
పని ప్రదేశం: సిరిసిల్ల మరియు హైదరాబాద్.
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా మరియు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో రేపు ఉదయం 11 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో హాజరుకావాలి. వివరాలకు 8686416834 నంబర్‌ను సంప్రదించగలరు.

