వరి ధాన్యం రోడ్లమీద ఆరబోయడం వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు
న్యూస్ పవర్, 1 మే , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని ప్రధాన రహదారులపై వరి ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని దీనివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు రైతులు తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్లలో మాత్రమే ఆరబోయాలని సూచించారు ప్రజల భద్రత దృష్ట్యా రైతులు అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

