Skip to main content

Posts

Showing posts with the label Telugu News

డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ

డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ  న్యూస్ పవర్ ,23 అక్టోబర్ , ఇల్లంతకుంట: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బాబాసాహెబ్ గీతే  ఆదేశాల మేరకు గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్, కేరళ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాల, రహీంఖాన్ పేట మోడల్ స్కూల్‌లలో విద్యార్థినీ‑విద్యార్థులకు “డ్రగ్స్ నిర్వారణలో పోలీస్ పాత్ర” మరియు “విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు” అనే అంశాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.   ఈ పోటీలో ఉత్తమంగా ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎస్పీ  స్వయంగా బహుమతులు అందజేయనున్నట్టు ఇల్లంతకుంట ఎస్సై  సిరిసిల్ల అశోక్ తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు

ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు  న్యూస్ పవర్, 23 అక్టోబర్ , ఇల్లంతకుంట: అక్రమ  ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసి డ్రైవరు మరియు యజమాని రిమాండ్ చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,  గురువారం  ఉదయం  ఇల్లంతకుంట మండలం పొత్తూరు శివారులోని బిక్క వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక నింపుకొని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని పంచనామ ద్వారా సీజ్ చేసి  ట్రాక్టర్ డ్రైవర్ నక్క రజనీకాంత్ మరియు ట్రాక్టర్ యజమాని  ఆకుల తిరుపతి   వ్యక్తుల మీద కేసు నమోదు చేసుకొని వారిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగిందనీ ఎస్ఐ తెలిపారు.

రసమయి ఇంటిపై దాడి సరికాదు

రసమయి ఇంటిపై దాడి సరికాదు • జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు  న్యూస్ పవర్, అక్టోబర్, ఇల్లంతకుంట:  మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఇంటి పై కాంగ్రెస్ నాయకులు దాడులు చేసి పైశాచికానందం పొందుతున్నారని, కాంగ్రెస్  దమ్ము,ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే ని ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు అన్నారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ చేతకాని దద్దమ్మల లెక్క కాంగ్రెస్ గుండాలు రసమయి బాలకిషన్  ఇంటిపై దాడులు చేయడం మానుకోవాలని, మా బీఆర్ఎస్ సైన్యంతో కలిసి దాడులు చేయాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు ఊర్లు వదిలి పరుగెత్తాల్సి వస్తుందని అన్నారు. మానకొండూర్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని గ్రహించి స్థానిక ఎమ్మెల్యే సారధ్యంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై, బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడటం కాదు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, కాంగ్రెస్ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేకనే నిత్యం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎదో ఒకటి కథ అల్లుతూ పబ్...

రసమయి బాలకిషన్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు

రసమయి బాలకిషన్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు న్యూస్ పవర్, 17 అక్టోబర్, ఇల్లంతకుంట: మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఇంటిని ఇంటిని ముట్టడించడానికి బెజ్జంకి మండలం గుండారంలోని ఆయన ఫామ్ హౌస్ ను ముట్టడించి నిరసన తెలుపుతుండగా పోలీస్ వారు అక్కడి నుండి అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్, డైరెక్టర్లు వీరేశం వీరేశం సురేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేశం, సోషల్ మీడియా అధ్యక్షుడు కాసుపాక రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు షాదీక్ ఉన్నారు.

రసమయి దిష్టి బొమ్మ దగ్ధం

రసమయి దిష్టి బొమ్మ దగ్ధం న్యూస్ పవర్ , 17 అక్టోబర్ , ఇల్లంతకుంట:  ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ దిష్టి బొమ్మను మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ  మానకొండూర్ నియోజకవర్గ  శాసనసభ్యుడు   డా. కవ్వంపల్లి సత్యనారాయణ  పై మరియు ఆయన కుటుంబ సభ్యలపై మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్   అభ్యంతరకరమైన, దురుసుగా మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందని. ఇలాంటి మాటలు ఇంకోసారి గనుక మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.  శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి వెంటనే బేషరతుగా  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమల్, ఎస్ సి సెల్ జిల్లా నాయకులు జుట్టు నగేష్, ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేష్, సాయి వర్మ, మల్లయ్య, బడుగు లింగం,బంగారి ఆంజినేయులు,లక్ష్మన్, రవి, దయసాగర్, బాబు, చిక్కుడ...

కపాస్ యాప్ పరిశీలన

    కపాస్ యాప్ పరిశీలన   న్యూస్ పవర్, 16 అక్టోబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు మరియు నర్సక్కపేట గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అఫ్జల్ బేగం  కిసాన్ కపాస్ అప్లికేషన్ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులు పత్తి పంటను సిసిఐ  ద్వారా విక్రయించటానికి ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.   అలాగే యాప్ వినియోగంలో ఏవైనా సాంకేతిక లేదా క్షేత్రస్థాయి సమస్యలు ఎదురైతే సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. సురేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి లలిత, సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.  

రేపాకలో ఉచిత నేత్ర వైద్య శిభిరం!

    రేపాకలో ఉచిత నేత్ర వైద్య శిభిరం     న్యూస్ పవర్, 16 అక్టోబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల లో  లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ వారు ఉచిత నేత్ర  వైద్య శిబిరం  నిర్వహించారు. రేపాక చుట్టు ప్రక్కల గ్రామాలు సోమారం పేట, కిష్టాపూర్, ఆరెపల్లె, గుండారం, తాళ్ళల్ల పల్లె, కళ్లెపెల్లి గ్రామాలకు చెందిన  130మందికి  నేత్ర వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, 30 మందిని కంటి ఆపరేషన్  కొరకు గుర్తించారు. కంటి ఆపరేషన్ కొరకు గుర్తించిన వారిలో 14 మందిని ఇదే రోజు ఉచిత కంటి ఆపరేషన్ కై  ఉచిత వాహనంలో రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ సభ్యులు  మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ప్రతి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.తినడానికి తిండి లేని పేద వారికి ఆహారం, బట్టలు అందించడం, వృద్దులకు చేతికర్రలు  అందించడం వంటి సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నామన్నా...

డీసీసీ జిల్లా అధ్యక్షుడుగా అవకాశం ఇవ్వండి

డీసీసీ జిల్లా అధ్యక్షుడుగా అవకాశం ఇవ్వండి   న్యూస్ పవర్, 15 అక్టోబర్ , ఇల్లంతకుంట :  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో  పట్టణంలోని జరిగిన సంఘటన్ సృజాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల లో ఏఐసీసీ ఇంచార్జ్  మరియు కర్ణాటక  రాష్ట్రంలోని   ఎమ్మెల్యే శ్రీనివాసన్ మన్నే ని కలిసిన ఇల్లంతకుంట మండల్ మాజీ ప్రజాప్రతినిధులు డీసీసీ జిల్లా అధ్యక్షుడుగా మాజీ ఎంపీపీ రమణ రెడ్డి కి మద్దతుగా వారి పేరు సూచిస్తూ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో   మాజీ సర్పంచ్ సంజీవ్ మాజీ ఎంపీటీసీలు కథ మల్లేశం  కీసర కనకయ్య, చీట్టి ప్రదీప్ రెడ్డి గూడ బాబు ఉన్నారు.

ఎంబిబిఎస్ సీట్ సాధించిన చెప్యాల గౌతమి

 ఎంబిబిఎస్ సీట్ సాధించిన చెప్యాల గౌతమి  న్యూస్ పవర్ , 14 అక్టోబర్ , ఇల్లంతకుంట: కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని దాచారం హై స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాణి మేడం మరియు ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు బాలగౌడ్  అన్నారు. గ్రామానికి చెందిన, ప్రభుత్వప్రాథమిక  పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చెప్యాల గౌతమి అనే విద్యార్థిని నీట్  లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దీంతో ఆమెకు కరీంనగర్ లోని (పీమ్స్) ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ చదవనుంది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ చెప్యాలా గంగాధర్ కూతురు గౌతమికి ఎంబిబిఎస్ లో చోటు సాధించడం పట్ల దాచారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందంతోపాటుగా గ్రామస్తులు, ,విద్యార్థులు గౌతమికి సన్మానం చేశారు. ఈసంధర్భంగా గౌతమిని గ్రామస్థులు  అభినందించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల గౌడ్ , ఉపాధ్యాయులు తుంకుంట నరేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , రమేష్  తో పాటుగా విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి – యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన

  రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి – యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన • పొత్తూరు గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన   న్యూస్ పవర్, 10 అక్టోబర్ , ఇల్లంతకుంట: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం), కరీంనగర్ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం లో భాగంగా మహాత్మా జ్యోతిభ పులే వ్యవసాయ కళాశాల, కరీంనగర్ విద్యార్థులు పొత్తూరు గ్రామంలోని రైతువేదిక వద్ద రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాసంగి పంటల ప్రణాళికపై రైతులు మరియు శాస్త్రవేత్తల మధ్య చర్చా గోష్ఠి జరిగింది. రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, శాస్త్రవేత్తల సూచనలను పాటించడం ద్వారా ఎక్కువ దిగుబడులు పొందవచ్చని సూచించారు.   అలాగే వ్యవసాయ పరిశోధన సంచాలకుడు డా. బి. రాంప్రసాద్ రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు పంటల సరళిని మార్చుకోవాలని, మార్కెట్ డిమాండ్‌ ఉన్న పంటల సాగు ద్వారా లాభాలు సాధించవచ్చని తెలిపారు.   అసోసియేటెడ్ డీన్...

మాదిగల ఐక్యతకై 'అలయ్ - బలయ్' కార్యక్రమము

  మాదిగల ఐక్యతకై 'అలయ్ - బలయ్' కార్యక్రమము   న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , ఇల్లంతకుంట:  మాదిగలలో రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాదిగల అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాదిగల ఐక్య వేదిక మండల కన్వీనర్ సావనపెల్లి రాకేష్ ప్రకటించారు   ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగల ఐక్యత కోసం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నెల 8, బుధవారం  ఉదయం 11 గంటలకు   ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ. రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు   ఈ కార్యక్రమానికి మాదిగ మాజీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, అలాగే ప్రతి గ్రామం నుడి మాదిగ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు .

దుర్గాదేవి మండపంలో ఘనంగా పూజలు

దుర్గాదేవి మండపంలో ఘనంగా పూజలు   న్యూస్ పవర్, 3అక్టోబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మాజీ సర్పంచ్  వొగ్గు నర్సయ్య  పూజా కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులకు రూ. 20116 లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, కూనబోయిన బాలరాజు, ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగ సముద్రాల బాలకృష్ణ, గూఢ నరేందర్ రెడ్డి, అర్చకులు రాజేశ్వర్ శర్మ, హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

గంగాధర క్షేత్రంలో చండి మహా యాగం

గంగాధర క్షేత్రంలో చండి మహా యాగం • సామూహిక కుంకుమార్చనలు, సుహాసిని పూజ   న్యూస్ పవర్, 1 అక్టోబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో చండీ మహాయాగం కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. చండి మహా యాగంతో పాటుగా, "సామూహిక కుంకుమార్చనలు", "సుహాసిని పూజ", పాటుగా గంగాధరుడికి విశేష అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గంగాధర క్షేత్రం ఆధ్వర్యంలో, మూగు దామోదర అన్నదాన సత్రంలో, అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు, ప్రముఖ పురోహితులు మూగు నాగరాజు శర్మ, అనూప్ శర్మ, నాగలింగం పంతులు, తో పాటుగా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి నిర్మాణం, శక్త ఆరాధన, ధర్మ జీవనమే ప్రపంచ శాంతి మార్గం

వ్యక్తి నిర్మాణం, శక్త ఆరాధన, ధర్మ జీవనమే ప్రపంచ శాంతి మార్గం   న్యూస్ పవర్,1 అక్టోబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట లోని ఆర్యవైశ్య భవన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవం లో ముఖ్య వక్త కరినగర్ జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ మాటూరి లింగమూర్తి  మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 ఈ విజయదశమి రోజున ప్రారంభమైందని 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నారు. విజయదశమి అనగానే అధర్మంపై ధర్మం గెలుపునకు గుర్తుగా కృతయుగంలో రావణాసురుడిపై రాముడు గెలుపొందింది, మరియు త్రేతాయుగంలో పాండవులు గెలుపొందిన రోజు కూడా ఇదే విజయదశమి అని, లోకానికి శాంతి మార్గం రావాలంటే ప్రతి ఒక్కరిలో శక్తి సముపర్జన చేయాలి అని, సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించాలని అందుకు ప్రతి ఒక్కరు ధర్మ మార్గాన్ని అనుసరించాలని అన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజులలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి గ్రామలలో శాఖలు మరియు జనజాగరణ, హిందూ సమ్మేళనాలు, యువకుల సమ్మేళనాలు, ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనాలు, కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ...

జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు • రెండు, మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు • షెడ్యూల్ విడుదల రాజన్న సిరిసిల్ల  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడో విడతలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ 123 స్థానాలు ఉండగా, జడ్పీటీసీ 12 స్థానాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. మొత్తం 260 జీపీలు, 2268 వార్డులు ఉన్నాయని వెల్లడించారు. ---------------------------------------- *మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు* బోయినపల్లి 11 స్థానాలు, 60 పోలింగ్ కేంద్రాలు  చందుర్తి 10 స్థానాలు, 54 పోలింగ్ కేంద్రాలు  రుద్రంగి 5 స్థానాలు, 27 పోలింగ్ కేంద్రాలు  వేములవాడ అర్బన్ 6 స్థానాలు, 36 పోలింగ్ కేంద్రాలు   వేములవాడ రూరల్ 7 స్థానాలు, 40 పోలింగ్ కేంద్రాలు  కోనరావుపేట 12 స్థానాలు, 70 పోలింగ్ కేంద...

నిస్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలి

నిస్పక్షపాతంగా ఎన్నికలు విధులు నిర్వర్తించాలి • కలెక్టర్ హరిత • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులకు ఎంసీసీపై శిక్షణ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ - 30 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరిత ఆదేశించారు.  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్( ఎంసీసీ)పై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత హాజరై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఎఫ్ఎస్, ఎస్ఎస్టీ లు సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని సూచించారు.   ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎన్ని...

స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది

స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది:   • మూడు దశల్లో గ్రామ పంచాయతీ, రెండు దశల్లో MPTC/ZPTC ఎన్నికలు హైదరాబాద్, సెప్టెంబర్ 29, 2025: తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది  రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో, మరియు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ZPTC) రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది  ఎన్నికల నేపథ్యం మరియు సన్నాహాలు 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 197(6) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం మధ్య పరస్పర అంగీకారంతో ఈ ఎన్నికల షెడ్యూల్ మరియు తేదీలను ఖరారు చేశారు  గ్రామీణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ప్రభుత్వానిదేనని, ఈ మేరకు ప్రభుత్వం సెప్టెంబర్ 26, 2025న మార్గదర్శకాలను జారీ చేసింది . ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అన్ని శాఖల అధికారులు స్పష్టం చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది  సెప్టెంబర్ 30, 2025లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని గౌరవ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది  గ్రా...

గాలిపల్లి పల్లె దవాఖానలో ప్రత్యేక వైద్య శిబిరం

 గాలిపల్లి పల్లె దవాఖానలో ప్రత్యేక వైద్య శిబిరం    న్యూస్ పవర్,27 సెప్టెంబర్ , ఇల్లంతకుంట; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా  గాలిపల్లి పల్లె దవాఖాన/ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.   ఈ శిబిరంలో చెవి-ముక్కు-గొంతు నిపుణుడు డాక్టర్ మోహన్ కృష్ణ  ప్రత్యేక పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, ఇయర్ డ్రాప్స్, నోస్ డ్రాప్స్ అందజేశారు. అలాగే ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో మొత్తం 74 మంది  పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ రమేష్, ఎంఎల్హెచ్పీలు సంధ్య, నవనీత, సూపర్వైజర్ జవహర్, ఏఎన్ఎమ్ కవిత, ఆశా కార్యకర్తలు, ప్రజలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత

పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత  న్యూస్ పవర్ , 26 సెప్టెంబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన వల్లంపట్ల పరుశురాం తన రెండు ఆవులను తీసుకొని మేతకు వెళ్ళగా అక్కడే మేతమేస్తున్న ఆవులపై పిడుగుపాటు పడడంతో ఒక్కసారిగా రెండు ఆవులు ముత్యువాత పడ్డాయి. దీంతో సదర్ రైతు పరశురాములు తోపాటుగా కుటుంబ సభ్యులు కన్నీరు మునిరిగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు

మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు • జిల్లాలో మొత్తం 48 దుకాణాలు • గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -25: జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో డ్రా ను గురువారం కలెక్టర్ చేపట్టారు.  జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీ లకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని కలెక్టర్ వెల్లడించారు. రౌండ్ల వారిగా డ్రాను తీశారు.  *ఎస్సీలకు డ్రా పద్ధతిలో వచ్చిన దుకాణాల నంబర్లు* *14, 28, 34, 40, 43* *గౌడ్లకు డ్రా పద్ధతిలో వచ్చిన 9 దుకాణాల నంబర్లు* *02,15,17,18, 33,36,38,46,48* *రేపటి నుంచి..* ఈ నెల 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరించనున్నారు. అప్లికేషన్లు ఇచ్చేందుకు ఆఖరి గడువు వచ్చే నెల(అక్...