రేపాకలో ఉచిత నేత్ర వైద్య శిభిరం
న్యూస్ పవర్, 16 అక్టోబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ వారు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. రేపాక చుట్టు ప్రక్కల గ్రామాలు సోమారం పేట, కిష్టాపూర్, ఆరెపల్లె, గుండారం, తాళ్ళల్ల పల్లె, కళ్లెపెల్లి గ్రామాలకు చెందిన 130మందికి నేత్ర వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, 30 మందిని కంటి ఆపరేషన్ కొరకు గుర్తించారు. కంటి ఆపరేషన్ కొరకు గుర్తించిన వారిలో 14 మందిని ఇదే రోజు ఉచిత కంటి ఆపరేషన్ కై ఉచిత వాహనంలో రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ సభ్యులు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ప్రతి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.తినడానికి తిండి లేని పేద వారికి ఆహారం, బట్టలు అందించడం, వృద్దులకు చేతికర్రలు అందించడం వంటి సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కంటి చూపు పోయిన వారికి కంటి చూపు తిరిగి తెప్పించాలనే ఉద్దేశ్యంతో నేడు ఈ ఉచిత నేత్ర వైద్య శిభిరం నిర్వహించడం జరిగిందని, మంచి స్పందన వచ్చిందని వారు సంతోషం వ్యక్తంజేశారు.మానవ సేవే మాధవ సేవ అనే విధానంతో సేవా కాసర్యక్రమాలను నిస్వార్త చింతనతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎఫ్ డబ్ల్యూ సి బి. సరళ, ఆర్ సి సంపత్ కుమారి, అధ్యక్షులు పాత కిరణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు మారం ప్రశాంత్, కార్యదర్శి రొండ్ల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి టి. నాగశేషు, సభ్యులు మంద విష్ణు వర్ధన్ రెడ్డి, ఒంటెల సత్యలక్ష్మి,, ఒంటెల రాఘవేందర్ రెడ్డి, కామిరెడ్డి సదాశివ రెడ్డి, గన్ను రాజిరెడ్డి ఉమ్మెంతల శ్రీనివాస్ రెడ్డి,రేకుర్తి నేత్ర వైద్యాశాల కంటి వైద్య నిపుణులు చింతల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
