ఎంబిబిఎస్ సీట్ సాధించిన చెప్యాల గౌతమి
న్యూస్ పవర్ , 14 అక్టోబర్ , ఇల్లంతకుంట:
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని దాచారం హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాణి మేడం మరియు ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు బాలగౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన, ప్రభుత్వప్రాథమిక
పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చెప్యాల గౌతమి అనే విద్యార్థిని నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దీంతో ఆమెకు కరీంనగర్ లోని (పీమ్స్) ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ చదవనుంది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ చెప్యాలా గంగాధర్ కూతురు గౌతమికి ఎంబిబిఎస్ లో చోటు సాధించడం పట్ల దాచారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందంతోపాటుగా గ్రామస్తులు, ,విద్యార్థులు గౌతమికి సన్మానం చేశారు. ఈసంధర్భంగా గౌతమిని గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల గౌడ్ , ఉపాధ్యాయులు తుంకుంట నరేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , రమేష్ తో పాటుగా విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
