దళారులకు అమ్మి నష్టపోవద్దు
న్యూస్ పవర్ , 13 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమాన్నిమానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో అండగా ఉంటుందని పేర్కొన్నారు . మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేశారు
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లి, అనంతారం, ముస్కానిపేట, గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు ఈ ఏడాది ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం ప్రకటించిందని, దీని ప్రకారం ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389, సాధారణ రకం రూ.2,369కు కొనుగోలు చేయాలని నిర్దేశించిన దృష్ట్యా కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు
రైతులు వర్షాల సాకుతో దళారులకు అమ్మి నష్టపోకుండా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి లబ్ధి పొందాలని ఎమ్మెల్యే కోరారు . ధాన్యాన్ని భద్రపరిచేందుకు వీలులేకపోవడాన్ని అదునుగా చేసుకున్న కొంత మంది దళారులు పొలాల వద్దే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు దళారుల మోసాలకు గురికావొద్దని ఆయన రైతులను కోరారు రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫారుక్, ఎంపిడిఓ శశికళ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య-మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎనగందుల ప్రసాద్, పార్టీ నాయకులు రాజేశం, వీరేశం, రజనీకాంత్, కె.రాంప్రసాద్, వెంకటరెడ్డి, పసుల వెంకటి, అంతగిరి, తీగల పుష్పలత, నీరజ, జ్యోతి, సురేందర్ రెడ్డి, మామిడి రాజు, గొడుగు హరికుమార్, సంజీవ్, కె.మల్లేశం తదితరులు పాల్గొన్నారు .
