జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయం: సిద్ధం వేణు
న్యూస్ పవర్ , 14 అక్టోబర్ , ఇల్లంతకుంట:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత ఖచ్చితంగా విజయం సాధిస్తారని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు విశ్వాసం వ్యక్తం చేశారు ఆమెకు మద్దతుగా పల్లె నర్సింహారెడ్డి, కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి (కేవీయన్ రెడ్డి) లు ప్రచార చేశారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేసి, ధనప్రవాహాన్ని పెంచినా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును ఎవరూ ఆపలేరని తెలిపారు.
