దుర్గాదేవి మండపంలో ఘనంగా పూజలు
న్యూస్ పవర్, 3అక్టోబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ వొగ్గు నర్సయ్య పూజా కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులకు రూ. 20116 లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, కూనబోయిన బాలరాజు, ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగ సముద్రాల బాలకృష్ణ, గూఢ నరేందర్ రెడ్డి, అర్చకులు రాజేశ్వర్ శర్మ, హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
