గంగాధర క్షేత్రంలో చండి మహా యాగం
• సామూహిక కుంకుమార్చనలు, సుహాసిని పూజ
న్యూస్ పవర్, 1 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో చండీ మహాయాగం కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. చండి మహా యాగంతో పాటుగా, "సామూహిక కుంకుమార్చనలు", "సుహాసిని పూజ", పాటుగా గంగాధరుడికి విశేష అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గంగాధర క్షేత్రం ఆధ్వర్యంలో, మూగు దామోదర అన్నదాన సత్రంలో, అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు, ప్రముఖ పురోహితులు మూగు నాగరాజు శర్మ, అనూప్ శర్మ, నాగలింగం పంతులు, తో పాటుగా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
