వ్యక్తి నిర్మాణం, శక్త ఆరాధన, ధర్మ జీవనమే ప్రపంచ శాంతి మార్గం
న్యూస్ పవర్,1 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట లోని ఆర్యవైశ్య భవన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవం లో ముఖ్య వక్త కరినగర్ జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ మాటూరి లింగమూర్తి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 ఈ విజయదశమి రోజున ప్రారంభమైందని 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నారు. విజయదశమి అనగానే అధర్మంపై ధర్మం గెలుపునకు గుర్తుగా కృతయుగంలో రావణాసురుడిపై రాముడు గెలుపొందింది, మరియు త్రేతాయుగంలో పాండవులు గెలుపొందిన రోజు కూడా ఇదే విజయదశమి అని, లోకానికి శాంతి మార్గం రావాలంటే ప్రతి ఒక్కరిలో శక్తి సముపర్జన చేయాలి అని, సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించాలని అందుకు ప్రతి ఒక్కరు ధర్మ మార్గాన్ని అనుసరించాలని అన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజులలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి గ్రామలలో శాఖలు మరియు జనజాగరణ, హిందూ సమ్మేళనాలు, యువకుల సమ్మేళనాలు, ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనాలు, కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరముల కాలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, తిరుమలలో ఏడుకొండలను, రామసేతును కాపాడుకోవడం లాంటివి అనేక విజయాలు సాధించాం అన్నారు. వరదలు, తుఫాను, భూకంప సమయాలలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించడం, భారతదేశంతో పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాలలో సైనికులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహకారం అందించారు అని తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలబడింది అన్నారు. ఆర్ఎస్ఎస్ లో తయారైనటువంటి స్వయంసేవకులు అన్ని రంగాలలో పనిచేస్తున్నారని అన్నారు. పంచ పరివర్తన లో భాగంగా సామాజిక సమరసత ద్వారా సమాజంలో కుల,వర్గ, మత భేదం లేకుండా ఉండడం, పౌర విధులు నిర్వర్తించడం, స్వదేశీ వస్తువులను వినియోగించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, కుటుంబ విలువలను కాపాడుకోవడం, పాటించడం విషయాలను తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథి చొప్పరి రామచంద్రం , ఖండ కార్యవాహా తాటిపల్లి మహేష్, వ్యవస్థ ప్రముఖ కాసుపాక కిషన్, సేవా ప్రముఖ్ బొల్లం ధనంజయ్, ఉపమండల ప్రముఖ్ సార శశికాంత్, నార్ల రాంకిషన్, ఈదుల రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు.
