మాదిగల ఐక్యతకై 'అలయ్ - బలయ్' కార్యక్రమము
న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , ఇల్లంతకుంట:
మాదిగలలో రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాదిగల అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాదిగల ఐక్య వేదిక మండల కన్వీనర్ సావనపెల్లి రాకేష్ ప్రకటించారు
ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగల ఐక్యత కోసం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా
ఈ నెల 8, బుధవారం ఉదయం 11 గంటలకు
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ. రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమానికి మాదిగ మాజీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, అలాగే ప్రతి గ్రామం నుడి మాదిగ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు .
