కాటమయ్య కవచాలతో గీతన్నలకు రక్షణ • మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి న్యూస్ పవర్ , 24 అక్టోబర్ , కరీంనగర్: గీత కార్మికుల సంక్షేమం, పరి రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 250 మంది కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కల్లు గీత ప్రమాదకమైన వృత్తి అని, తాటి చెట్లు ఎక్కి దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారిపడిన సంఘటనలు అనేకం ఉన్నాయ న్నాయన్నారు. ఇలాంటి ప్రమాదా ల్లో కొందరు గాయపడగా, మరి కొందరు మృత్యువాత పడ్డార న్నారు. తాటి చెట్లపై నుంచి జారిపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి కాటమయ్య రక్షణ కవచాలను తయారు చేయించిందన్నారు. ఇక నుంచి ఏ ఒక్క గీత కార్మికుడు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్‌ను అందిస...