Skip to main content

Posts

Showing posts with the label Heavy Rains Alert

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ  ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,    ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎడతెరిపి లేని వర్షాలు  ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.   భారీ వర్షాలు కురుస్తుందున వల్ల  ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాలువలు వద్దకు  ఎవరు వెళ్లవద్దన్నారు.   ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. అలాగే విద్యుత్ పరికరాలను మరియు పోల్స్ కు దూరంగా ఉండాలి.విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి  పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా  10...