స్వయం ఉపాధి పథకాలు మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి: జిల్లా పరిశ్రమల కేంద్రం జి.ఎమ్. టి. హనుమంతు
స్వయం ఉపాధి పథకాలు మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి: జిల్లా పరిశ్రమల కేంద్రం జి.ఎమ్. టి. హనుమంతు రాజన్న సిరిసిల్ల | తేది: 21.04.2026 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు (SHGs), విద్యార్థులు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ టి. హనుమంతు గారి మార్గదర్శకత్వంలో వివిధ ఉపాధి మరియు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న MSME పథకాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలను వినియోగించుకుని యువత స్వయం ఉపాధి దిశగా ఎదగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమైన పథకాలు మరియు రాయితీలు: 1. PMEGP పథకం (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం): తయారీ రంగం: గరిష్టంగా ₹50 లక్షల వరకు ఆర్థిక సహాయం. సేవా రంగం: గరిష్టంగా ₹20 లక్షల వరకు ఆర్థిక సహాయం. ప్రత్యేకత: ₹10 లక్షల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా రుణం. సబ్సిడీ: 15% నుండి 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. 2. PMFME పథకం (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు): వ్యక్తిగత యూనిట్లు: ₹10 లక్షల వరకు ప...