పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత
న్యూస్ పవర్ , 26 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన వల్లంపట్ల పరుశురాం తన రెండు ఆవులను తీసుకొని మేతకు వెళ్ళగా అక్కడే మేతమేస్తున్న ఆవులపై పిడుగుపాటు పడడంతో ఒక్కసారిగా రెండు ఆవులు ముత్యువాత పడ్డాయి. దీంతో సదర్ రైతు పరశురాములు తోపాటుగా కుటుంబ సభ్యులు కన్నీరు మునిరిగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
