సమాజ సంఘటన కార్యమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
• కరినగర్ జిల్లా పర్యావరణ ప్రముఖ్ బత్తిని ఆంజనేయులు
న్యూస్ పవర్ , 26 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం లోని గాలిపల్లి గ్రామంలో సామ అంతవ్వ నరసింహారెడ్డి ఫంక్షన్ హాలులో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ దశమి ఉత్సవం లో ముఖ్య వక్త కరీంనగర్ జిల్లా పర్యావరణ ప్రముఖ్ బత్తిని ఆంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 ప్రారంభమైందని అన్నారు.2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజులలో జనజాగరణ, హిందూ సమ్మేళనాలు, యువకుల సమ్మేళనాలు, ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనాలు, కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరముల కాలంలో అనేక విజయాలను సాధించిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలబడింది అన్నారు. ఆర్ఎస్ఎస్ లో తయారైనటువంటి స్వయంసేవకులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారని అన్నారు.క్రమశిక్షణ, త్యాగము సమర్పణ, పట్టుదల కలిగిన కార్యకర్తలను నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని అన్నారు.సమాజంలోని వ్యక్తులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే సంఘం పని అన్నారు. పంచ పరివర్తన లో భాగంగా సమాజంలో కుల మత భేదం లేకుండా ఉండడం, పౌర విధులు నిర్వర్తించడం,గో ఆధారిత వ్యవసాయం చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, కుటుంబ విలువలను కాపాడుకోవడం, పాటించడం విషయాలను తెలియజేయాలని చెప్పారు.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథి తాటికొండ అంజయ్య, ఖండ కార్య వాహ్ తాటి పెళ్లి మహేష్, ఖండ వ్యవస్థ ప్రముఖ్ కాసుపాక కిషన్, సేవ ప్రముఖ్ బొల్లం ధనుంజయ, బాలనాగచారి, పల్లె లక్ష్మణ్, కాసం మహేష్, సింగిరెడ్డి రమణారెడ్డి, కుంభం సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
