గాలిపల్లి పల్లె దవాఖానలో ప్రత్యేక వైద్య శిబిరం
న్యూస్ పవర్,27 సెప్టెంబర్ , ఇల్లంతకుంట;
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా గాలిపల్లి పల్లె దవాఖాన/ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో చెవి-ముక్కు-గొంతు నిపుణుడు డాక్టర్ మోహన్ కృష్ణ ప్రత్యేక పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, ఇయర్ డ్రాప్స్, నోస్ డ్రాప్స్ అందజేశారు. అలాగే ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 74 మంది పరీక్షలు చేయించుకున్నారు.
శిబిరంలో పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ రమేష్, ఎంఎల్హెచ్పీలు సంధ్య, నవనీత, సూపర్వైజర్ జవహర్, ఏఎన్ఎమ్ కవిత, ఆశా కార్యకర్తలు, ప్రజలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
