గ్రామపంచాయితీ సిబ్బందికి దుస్తుల పంపిణీ
న్యూస్ పవర్ , 27 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట్ గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గ్రామపంచాయితీ సిబ్బందికి దుస్తుల పంపిణీ నిర్వహించారు.
ఏఆర్ కానిస్టేబుల్ గడ్డమీది శ్రీనివాస్ గ్రామపంచాయితీకి చెందిన 5 మంది పారిశుధ్య సిబ్బందికి దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
-పారిశుధ్య కార్మికులు ఎలాంటి భయం లేకుండా, ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజారోగ్యం కోసం చిత్తశుద్ధితో తమ సేవలను అందిస్తున్నారు.
-వారు సమాజానికి ఆధారస్థంభాలుగా పని చేస్తున్నందున తమకు గౌరవం తోడుగా ఉండటం గర్వకారణమని అభిప్రాయపడ్డారు.
వారి కృషికి గుర్తింపుగా దుస్తులు అందజేయడం తన వంతు సహాయమని, భవిష్యత్తులో కూడా అన్ని విధాల సహకారం అందిస్తానని తెలిపారు.
గ్రామ ప్రజలు, యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, గడ్డమీది శ్రీనివాస్ ని అభినందించారు. కార్యక్రమం తర్వాత పారిశుధ్య సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
