ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
న్యూస్ పవర్, 25 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, బిజెపి పూర్వ సంస్థ అయిన భారతీయ జన సంఘ నాయకులు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అతి సామాన్య, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపారని కొనియాడారు ఆయన కార్యపద్ధతి స్ఫూర్తితో ఎందరో కార్యకర్తలు, నాయకులు తయారయ్యారని పేర్కొన్నారు . ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆయన దేశమాత సేవకై ప్రచారక్ గా పనిచేసి, ఆ తర్వాత జన సంఘంలో చేరారని గుర్తుచేశారు
నేటి భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకంగా నిలుస్తున్న 'ఇంటిగ్రల్ హ్యూమనిజం' (ఏకాత్మ మానవతావాదం) మరియు 'అంత్యోదయ' వంటి సిద్ధాంతాలను వారు నిర్వచించారని, అవి నేటి సమాజానికి ఎంతో మేలు చేశాయని అనిల్ కుమార్ అన్నారు . జాతీయ స్థాయి నాయకుడిగా ఉండి, అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందడం విచారకరమని, వారి మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . నాటి, నేటి తరాలకు స్ఫూర్తినిచ్చి, క్రమశిక్షణ మరియు నిబద్ధతను నేర్పిన మహనీయునికి నివాళులు అర్పించినట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మేకల మల్లేశం, జిల్లా కౌన్సిల్ మెంబర్ బత్తిని సాయి గౌడ్, జిల్లా నాయకుడు దేశెట్టి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి, మాజీ మండల అధ్యక్షుడు నాగసముద్రల సంతోష్, మండల ఉపాధ్యక్షుడు చిమ్మనగొట్టు శ్రీనివాస్, భూత్ అధ్యక్షుడు మిట్టపల్లి మధు, పినికాశి అనిల్, కనకయ్య, శేఖర్ లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు .
