పోత్తూరు గ్రామంలో ఘనంగా దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు

న్యూస్ పవర్ , 25 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం, పోత్తూరు గ్రామంలో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి , ఈ ఉత్సవాలలో భాగంగా, కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి సన్నిధానంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ,
దేవి సన్నిధిలో కుంకుమ పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయగా, భక్తులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ,
ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, మరియు భక్తులు పాల్గొన్నారు .
