పేరుకే పెద్ద మండలం అభివృద్ధి లో శూన్యం
•సావనపెల్లి రాకేష్
సామాజిక ఉద్యమ కారుడు
న్యూస్ పవర్ ,25; సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఇల్లంతకుంట పేరుకే పెద్ద మండలం అభివృద్ధి లో శూన్యం,ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మండలం అభివృద్ధి చెందడం లేదన్నారు,అధికార పార్టీ నాయకులు వ్యక్తిగత స్వార్ధ రాజకీయాలకు బానిసలుగా మారుతూ ప్రజా సమస్యలను విస్మరించడం సరైంది కాదన్నారు,రానున్న రోజుల్లో స్వార్ధ రాజకీయ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు, మానకొండూర్ శాసనసభ్యులు *డా" కవ్వంపెల్లి సత్యనారాయణ ఇల్లంతకుంటలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దసరా పండగా సందర్బంగా లబ్ధిదారులకు వెంటనే పంపిణి చేసి మండల అభివృద్ధికి కృషి చేయాలనీ డిమాండ్ చేస్తూ.. లేని యెడల పెద్ద ఎత్తున లబ్ధిదారులను, ప్రజలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామణి హెచ్చిరించారు..
