రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మాడల్ స్కూల్ విద్యార్థినిల ఎంపిక
న్యూస్ పవర్ , 25 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
కబడ్డీ అసోసియేషన్ 35 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట మాడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల) విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జీ గంగాధర్ , ఫిజికల్ డైరెక్టర్ మామిడి శ్రీనివాస్ లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.బాలికల విభాగంలో 10వ తరగతి చదువుతున్న కే శ్రీనిజ(వల్లంపట్ల),ఎం నిత్య(సోమారంపేట), పి వైష్ణవి(సిరికొండ)లు ఎంపికైనట్లు వారుతెలిపారు.ఈ నెల 18 న, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరచి, ఈ నెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రంలో జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని తెలిపిపారు. ఎంపికైయిన విద్యార్థులను అమ్మ ఆదర్శ కమిటి చైర్ పర్సన్ గాదే పద్మ, ఉపాధ్యాయ బృందం, గ్రామస్థులు విద్యార్థిని, విద్యార్థులు అభినందించారు.
