సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
న్యూస్ పవర్ , 28 అక్టోబర్ , ఇల్లంతకుంట :
సభ్యత్వ నమోదు కార్యక్రమం స్పెషల్ డ్రైవ్
సోమవారము రోజున వల్లంపట్ల ఓబులాపూర్ గ్రామాలలో మండల కన్వీనర్ దేశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి మండల ఇంచార్జ్ కరివేద మహిపాల్ రెడ్డి జిల్లా పరిశీలకులు ఏలేటి చంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు వచ్చినది మిగిలిన రెండు రోజులు అన్ని బూతులలో 300 సభ్యతము కచ్చితంగా చేసి బిజెపి పార్టీ ప్రతిష్ట కు పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అదేవిధంగా రైతులు వరి కోతలు కోసి నెలరోజులైనా వడ్ల సెంటర్లలో వడ్లు ప్రభుత్వము కొన్న దాఖలాలు లేవు తొందరగా సెంటర్లలో కొనుగోలు చేయాలనీ లేనిచో మా పార్టీ తరఫున రైతులకు మద్దతుగా ధర్నా చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో బత్తిని స్వామి కొలనూరు ముత్తక్క చదవాల రవి బూత్ అధ్యక్షుడు రాజు శేఖర్ ప్రణయ్ ఆత్మకూరు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
