డిజిటల్ క్రాఫ్ట్ సర్వే తో మహిళ ఏఈఓలకు ఇబ్బందులు
న్యూస్ పవర్ , 28 అక్టోబర్ , ఇల్లంతకుంట :
డిజిటల్ క్రాప్ సర్వే తో మహిళా ఏఈఓలు అవస్థలు పడుతున్నారు , రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఏఈవోలు గత రెండు రోజులుగా డిజిటల్ క్రాప్ సర్వే లో భాగంగా ఫీల్డ్ లో చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నెట్వర్క్ సమస్యలు, ఫోన్ ఛార్జింగ్, ఆగిపోవడం ఫీల్డ్ వరకు వెళ్ళక యాప్ ఓపెన్ కాకపోవడం విలేజ్ డేటా డౌన్లోడ్ కాక పోవడం, ఒక సర్వే నంబర్ దగ్గర వేరే రైతు వివరాలు చూపించడం పంట వివరాలు నమోదు చేశాక అప్లోడ్ కి చాలా సమయం పట్టడం, చివరికి పొలం దగ్గరికి వెళ్లాక లోకేషన్ ఇంకా చాలా దూరం ఉందని యాప్ లో చూపించడం దానివలన మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది,
పొలాలకి వెళ్లే దారులు సరిగా లేక కిలో మీటర్లు మేర దూరం నడిచి వెళ్ళడం , కరెంటు తీగలు, పాములు, వాగులు దాటడం చాలా రక రకాలుగా సమస్యలు ఎదురవుతున్నాయి
మరి ముఖ్యంగా రైతులు పొలాల దగ్గర అందుబాటులో లేకపోవడం వలన పొలాలు గుర్తించడం ఇబ్బందిగా ఉందని తెలియజేశారు
దీనికి తోడై ఇతర రకాల డిపార్ట్మెంట్ పనులుతో చాలా పని ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతుందని కావున ఫీల్డ్ సమస్యల పై అధికారుల అర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించాలి అని కోరారు
మహిళా ఏఈఓ లకు సర్వే నిర్మానుష్య ప్రాంతాలో భద్రత లేక పోవడం మరియు సర్వే నిర్వహణకి అవసరమైన సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు .
