ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలి
•కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
•సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై శిక్షణ
Rajanna Siricilla News
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)పై జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిబ్బందికి మంగళవారం శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల నవంబర్ ఒకటో తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ సర్వే మొదలు కానుందని తెలిపారు. మాస్టర్ ట్రెయినర్లు తమ పరిధిలోని ఎన్యుమరేటర్లకు సర్వే సందర్భంగా తీసుకోవాల్సిన వివరాలు, వాటిని నిర్ణిత ఫారాల్లో నింపాలని సూచించారు. ప్రతి అంశానికి సంబంధించిన అన్ని బుక్ లెట్లో ఉన్నాయని, వాటికి అనుగుణంగా నిర్ణిత ఫారాల్లో కోడ్స్ వేయాలని తెలిపారు. సర్వేతో జిల్లాలోని అన్ని కుటుంబాల వివరాలు తెలుస్తాయని, ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టనున్న పథకాలు, అభివృద్ది ఫలాలు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. సర్వే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి వివరించారు.
ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య ఎస్ డి సీ రాధాభాయ్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.