JSON Variables

వడ్ల కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి


వడ్ల కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి 

 న్యూస్ పవర్ , 2 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  వడ్ల కొనుగోలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులను కలిసి, రైతుల యొక్క బాధలను వారు అడిగి తెలుసుకున్నారు, తదనంతరం  బిజెపి మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక  సదుపాయాలు కల్పించలేనటువంటి స్థితిలో ఉన్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు సెంటర్ తో సహా మండలంలో  నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా తూకం నిర్వహణ చేయకపోవడంతో అకాల వర్షాలతో వడ్లు పూర్తిగా తడిసిపోయాయిని అన్నారు, తడిసిన వడ్లు మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురు అవుతున్న  వారి ఓట్లతో గద్దె నెక్కిన పాలకులు  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  కానీ, మండల అధికార, ప్రజాప్రతినిధులు గాని రైతులకు ఏ విధమైన భరోసనిచ్చారు తెలపాలి అని ప్రశ్నించారు, పాలకులు ఎప్పటికైనా  గ్రామాల్లోని  వడ్ల కొనుగోలు కేంద్రంలో పర్యటించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,తాలు పేరుతో కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయు విధంగా పాటుపడాలని అన్నారు, రైతులకు న్యాయం జరిగేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా  ప్రభుత్వంతో ఎంతటి పోరాటనికైనా సిద్ధం అని అన్నారుమండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రావణ్, సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు  కాట్నపల్లి రవీందర్ రెడ్డి, కిసాన్ మోచ మండల అధ్యక్షులు ఇట్రెడ్డి లక్ష్మారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రోడ్ల మధుసూదన్ రెడ్డి,శక్తి కేంద్రం ఇన్చార్జులు దేశెట్టి శ్రీనివాస్, బద్దం ఎల్లారెడ్డి, లోన్కోజు చంద్రం, మేకల మల్లేశం, అధికార ప్రతినిధి పున్ని రాజు,చింతలపల్లి రాజిరెడ్డి, మామిడి శేఖర్, పున్ని అనిల్, రైతులు  పాల్గొన్నారు.


లోకల్ యాడ్స్





Post a Comment

0 Comments