JSON Variables

ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం

ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం

న్యూస్ పవర్, 20 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో గుంతల రోడ్డు ద్వారా ప్రజలు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో  మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మాట ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి సీసీ రోడ్డు వేయిస్తున్నారని  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి అన్నారు 
ఇల్లంతకుంట మండల కేంద్రంలో  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు  ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య  పాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి  ఉపసర్పంచ్ సాదులు  పట్టణ శాఖ అధ్యక్షులు కునబోయిన రఘు మైనార్టీ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ వార్డు సభ్యులు అనంతగిరి భాస్కర్కోఆప్షన్ సభ్యులు బాలయ్య, మహేందర్, మామిడి తిరుపతి , పుష్పలత రవీందర్ రెడ్డి ప్రభాకర్ నాయకులు జనార్ధన్ నాగరాజు రాజేశం, పరశురాం కళ్యాణ్ నరసయ్య మల్లయ్య జనార్ధన్ మల్లయ్య  వార్డు సభ్యులు గ్రామ నాయకులు & మండల నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments