JSON Variables

రైతులు ఆర్నెళ్ల కొకసారి వడ్డీ ఎందుకు చెల్లించాలి??*

రైతులు ఆర్నెళ్ల కొకసారి వడ్డీ ఎందుకు చెల్లించాలి??
      - బద్దం.ఎల్లారెడ్డి


గాలిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో రసాభస


న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
గాలిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో బద్దం ఎల్లారెడ్డి అనే యువరైతు మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణంపై రైతుల వద్ద అరునెలకొకసారి వడ్డీ వసూలు చేస్తున్నారని..గత మూడు సర్వసభ్య సమావేశాలకు బ్యాంక్ మేనేజర్ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించగా అధ్యక్షుడు అన్నాడి అనంత రెడ్డి  మాట్లాడుతూ మాకున్న సర్క్యులర్ ప్రకారం మాకున్న ఆదేశాల ప్రకారం వడ్డీ వసూలు చేస్తున్నామని చెప్పగా మీదగ్గర ఉన్న సర్క్యులర్ మా రైతులకు చూపించాలని రైతులు మండి పడ్డారు. పక్కన ఉన్న సిద్దిపేట జిల్లాలో రైతులు ఏడాదికి ఒక్కసారే వడ్డీ చెల్లిస్తున్నారు.ఇక్కడే ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారని రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే  జిల్లా బాడీ మీటింగ్ లో ఇట్టి విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అడుగగా అక్కడ మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదని సమాధానం ఇవ్వడం విడ్డూరం.
రైతుల వడ్లు కొనేటప్పుడు చాలా దారుణంగా ఒక క్వింటాల్ కి 10కిలోల వడ్లు కోత పెడుతున్నారని..వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే తిరిగి రైతులకు సమస్య వచ్చినపుడు ఇటువైపు చూడడం లేదని బద్దం ఎల్లారెడ్డి అనే యువరైతు ఆగ్రహం వ్యక్తం చేయగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టే 10 కిలోల కోతలకు మేమేం చేయలేమని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో రైతులు ధర్నాకు దిగినప్పుడు మాతో కలిసి రావాలని కోరగా నాకు ఇష్టముంటే వస్తా లేకపోతే రానంటూ ప్రభుత్వానికి వత్తాసు పలకడంపై రైతులు మండి పడ్డారు.

Post a Comment

0 Comments