JSON Variables

బీజేపీ నాయకులను, మహిళలను అక్రమంగా అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం


 బీజేపీ నాయకులను, మహిళలను అక్రమంగా అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం

న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్  పర్యటిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన బీజేపీ నాయకులను, గ్రామస్తులను అరెస్ట్ చేయడం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ తీవ్రంగా ఖండించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే కి విన్నవించుకొనే అవకాశం కూడా కల్పించకుండా ముందస్తు అరెస్ట్ లు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను వినే  స్థితిలో  లేరని సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారనే అభద్రత భావంతో అధికార బలంతో అక్రమ అరెస్ట్ చేపించడం సరికాదన్నారు.  ప్రజల నుండి వస్తున్న సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి తప్ప వారిని అరెస్ట్ చూపిస్తూ ఇబ్బందులకు గురి చేయడం ఒక ప్రజాప్రతినిధిగా సరికాదన్నారు. వెంటనే బిజెపి నాయకులను, గ్రామస్థులను విడుదల చేయాలని  డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిప్పారాపు శ్రవణ్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షడు సూదుల కిషన్,దాచారం శక్తి కేంద్రం ఇంచార్జ్ పొన్నం కృష్ణ లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments