JSON Variables

ఇల్లంతకుంట కోర్టు కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం


ఇల్లంతకుంట కోర్టు కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం
 న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కోర్టు కానిస్టేబుల్ చందు నాయక్ కు ప్రశంసా పత్రం వచ్చిందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. 
ఇల్లంతకుంట మండలం లోని ఎక్కువ కక్షి దారులను కోర్టులో హాజరు పరిచి ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చేసిన కోర్టు కానిస్టేబుల్ చందు నాయక్ కు ఈరోజు సిరిసిల్ల లో సిరిసిల్ల ఎస్పీ. అఖిల్ మహాజన్ ప్రశంసా పత్రం అందజేసినట్లు అయన తెలిపారు.

Post a Comment

0 Comments