సీసీ రోడ్డుపై మట్టి, దుమ్ముతో ప్రజలకు ఇబ్బందులు
న్యూస్ పవర్, 12 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ నుండి వివేకానంద చౌరస్తా రోడ్డు, అలాగే బైపాస్ రోడ్డును ఆనుకొని నూతనంగా సీసీ రోడ్డు నిర్మించారు. కానీ, రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో ప్రజలు దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ప్రధాన రోడ్డుగా ఉండే ఈ రోడ్డు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, దుమ్ము ఎక్కువగా ఎగిసిపడి రోడ్డు పక్కన నివసించే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున, అధికారులు, పంచాయతీ సిబ్బందితో సీసీ రోడ్లపై పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
