గాలిపల్లి లో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ & సెలెక్షన్స్
న్యూస్ పవర్ , 12 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం ఆదేశానుసారం రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ & సెలక్షన్స్ ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో తేదీ 16 ఫిబ్రవరి 2025 ఆదివారం రోజున నిర్వహించబడునని జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్కు మల్లారెడ్డి, సింగారపు తిరుపతి, మండల కార్యదర్శి మామిడి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇట్టి పోటీలలో పాల్గొను బాల బాలికలు తేది 01-04-2009 తర్వాత జన్మించి, 55 కిలోల బరువు దాటకుండా ఉండాలని వారి వెంట ఒరిజినల్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తీసుకొని ఉదయం 8:30 గంటల వరకు క్రీడా మైదానంలో రిపోర్టు చేసి ఇట్టి పోటీలను విజయవంతం చేయగలరని కోరుచున్నాము. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. సాన బాబు 9440350422, మామిడి శ్రీనివాస్ 9966374646
0 Comments