Skip to main content

గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి



గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి


• ప్రతి మండలంలో ఒక గ్రామంలో 4 పథకాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలి

• ప్రారంభించు గ్రామాలలో ముందస్తుగా సీఎం సందేశం ప్రదర్శించాలి
• నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్

-----------------------------------
రాజన్న సిరిసిల్ల, జనవరి 25:
-----------------------------------
జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా *నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల మాట్లాడుతూ,* గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు  ముందుగా అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా  ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 

  ప్రతి మండలంలో 250 నుంచి 400 వరకు ఇండ్లు ఉన్న గ్రామాలను  స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ గ్రామాలను ఎంపిక చేయాలని అన్నారు.  ప్రజా పాలన ప్రారంభించే గ్రామాల జాబితా, గ్రామాలలో 4 పథకాల లబ్ధిదారుల వివరాలను  నిర్ణిత  నమునాలలో పంపాలని కలెక్టర్లకు సిఎస్ తెలిపారు. 

జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు  4 పథకాలను అధికారికంగా ప్రారంభించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని, 4 పథకాలకు సంబంధించి సదురు గ్రామాల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని  అన్నారు.

4 నూతన పథకాల లాంచింగ్ లో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలని,  గ్రామ సభలలో స్వీకరించిన నూతన దరఖాస్తులను సైతం పరిశీలించి అర్హులు ఉంటే రేపటి జాబితాలో యాడ్ చేయాలని  అన్నారు. 

నూతన రేషన్ కార్డుల జారీ ను తహసిల్దార్ బృందం, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఎంపీడీవో బృందం,  రైతు భరోసా జాబితా ను మండల వ్యవసాయ అధికారి బృందం, ఇందిరమ్మ రైతు భరోసా జాబితా ను  ఏపిఓ & నరేగా బృందం పరిశీలించి, ఆ జాబితాలో  అర్హులు మాత్రమే ఉండేలా పథకాలు  పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.

నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణం లో జరగాలని, 4  పథకాలకు సంబంధించి లబ్దిదారులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేలా చూడాలని, లబ్ధిదారుల వివరాలను గ్రామాలలో ప్రదర్శించాలని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో మంచి ఆడియో వీడియో ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని సీఏస్ అన్నారు.

4 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజలకు మరో సారి వివరించాలని,  ఎంపిక కాబడిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయాలని, అనంతరం ప్రజా ప్రతినిధులు తమ సందేశాలు అందించాలని, లాంచ్ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అడ్వైజర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లను ఆహ్వానించాలని సీఎస్ పేర్కొన్నారు.

*4 పథకాల లాంచింగ్ కోసం ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో వచ్చిన దరఖాస్తులను  సంబంధిత అధికారులకు పంపి,  నేడు క్షేత్రస్థాయి విచారణ చేయాలని , ఆ దరఖాస్తులలో అర్హులు ఉంటే పేర్లు నమోదు చేసి రేపటి లాంచింగ్ కార్యక్రమంలో పథకాలను సంబంధిత లబ్ధిదారులకు వర్తింపజేయాలని అన్నారు.* ప్రతి మండలంలో 4 పథకాల లాంచింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎటువంటి గందరగోళం జరిగేందుకు వీలు లేదని,  ప్రభుత్వ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడు వరకు చేరుతాయనే  విశ్వాసాన్ని ప్రజలలో కల్పించాలని అన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,* రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 వార్డు సభ్యులు విజయవంతంగా నిర్వహించామని అన్నారు.  నూతనంగా 16 వేల 505 రేషన్ కార్డు దరఖాస్తులు, 14 వేల 542 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 141 రైతు భరోసా దరఖాస్తులు, 9 వేల 172  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు మొత్తం40360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 నూతన పథకాల లాంచింగ్ కు ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...