అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి రిమాండ్

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న  వ్యక్తి రిమాండ్


న్యూస్ పవర్ , 12 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని రిమాండ్ చేసినట్టు ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు వివరాల్లోకి వెళితే 
 కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి  చెందిన  గంట సమ్మవ్వ    ఆమె తన భర్త కొమురయ్య ఆదేశాల మేరకు పిడిఎస్  రైస్ అక్రమంగా రహీమ్ ఖాన్ పెట్ గ్రామం లోని ప్రజల నుండి కొనుగోలు చేస్తుండగా  ఇల్లంతకుంట పోలీసు వారు   ఆమెను పట్టుకొని ఆమె నుంచి  1.5 క్వింటాల్స్ బియ్యం స్వాధీనపరచుకొని వారిద్దరిపై మీద కేసు చేసి ఆమెను బుధవారం రోజున రిమాండ్ చెయ్యడం జరిగిందనీ
ఇలా ఎవ్వరైనా పిడిఎస్  రైస్ అక్రమంగా కొనుగోలు చేసినట్లుయితే కేసు చెయ్యడం జరుగుతుందని  అంతేగాక ఎవరైనా ఇలా చేస్తున్నట్లయితే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు .

Post a Comment

0 Comments